
ఆపన్నహస్తం అందించండి
దోమకొండ: నిరుపేద కుటుంబానికి చెందిన ఓ యువకుడు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడగా, ఆస్పత్రిలో చికిత్స కోసం సుమారు రూ.10 లక్షలు వరకు అవుతాయని వైద్యులు పే ర్కొన్నారు. దీంతో బాధిత కుటుంబీకులు దాతల చేయూత కోసం ఎదురుచూస్తున్నా రు. దోమకొండకు చెందిన బలవత్రి శ్రీధర్‌తోపాటు మరో ఇద్దరు వ్యక్తులు కలిసి శనివారం రాత్రి రామారెడ్డి నుంచి దోమకొండకు ట్రాక్టర్ ట్రాలీని తీసుకువస్తున్నారు. కా మారెడ్డి పట్టణ శివారులోని క్యాసంపల్లి వద్ద ట్రాక్టర్ ట్రాలీని వెనుక నుంచి వేగంగా వ చ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శ్రీధర్ తీవ్రంగా గాయపడగా చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని సురారం మల్లారెడ్డి ఆస్పత్రికి తరలించారు. కాగా శ్రీధర్‌కు బ్రెయిన్ సర్జరీ చేయాలని, ఇందుకు దాదాపు రూ. 10లక్షల వరకు ఖర్చవుతుందని వైద్యులు తెలిపారు. దీంతో తాము పేద కుటుంబానికి చెందిన వారిమని, తమకు రూ.10 లక్షలు ఖర్చుపెట్టుకునే స్తోమత లేదని శ్రీధర్ తండ్రి శ్రీనివాస్, తల్లి వెంకటలక్ష్మి ఆవేదన చెందుతున్నారు. తమ కుమారుడికి దాతలు ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలన్నారు. సహాయం చేయవలసిన దాతలు శ్రీధర్ అన్న శ్రీకాంత్ ఫోన్‌నెంబర్ 7013951924కు ఫోన్‌పే, లేదా గూగుల్ పే చేసి సహాయం అందించాలని కోరారు.
● రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ దోమకొండకు చెందిన శ్రీధర్
● బ్రెయిన్ సర్జరీ కోసం రూ.10లక్షలు అవసరం
● దాతల కోసం బాధిత కుటుంబీకుల ఎదురుచూపులు