విద్యార్థులే లక్ష్యంగా గంజాయి విక్రయాలు | - | Sakshi
Sakshi News home page

విద్యార్థులే లక్ష్యంగా గంజాయి విక్రయాలు

Sep 8 2025 5:00 AM | Updated on Sep 8 2025 5:00 AM

విద్యార్థులే లక్ష్యంగా గంజాయి విక్రయాలు

విద్యార్థులే లక్ష్యంగా గంజాయి విక్రయాలు

ఎంతటివారైనా వదిలిపెట్టం..

నాందేడ్‌ నుంచి ప్రతి వారం

అక్రమంగా రవాణా

ఇటీవల భీమ్‌గల్‌లో విక్రేతను

అరెస్టు చేసిన పోలీసులు

మోర్తాడ్‌(బాల్కొండ): విద్యార్థులు, యువతే లక్ష్యంగా గంజాయి వ్యాపారులు తమ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. దీంతో చదువుకోవాల్సిన విద్యార్థు లు గంజాయి మత్తుకు బానిసై జీవితాన్ని నాశ నం చేసుకుంటున్నారు. తమపై తల్లిదండ్రులు పెంచుకున్న ఆశలను విద్యార్థి దశలోనే తుంచివేస్తున్నారు.

రుచి చూపించి..

ఇటీవల భీమ్‌గల్‌ డిగ్రీ కళాశాల వెనుక భాగంలో గం జాయి విక్రయిస్తున్న కారెపల్లికి చెందిన బూక్యా ర ఘును మూడు రోజుల కింద ఎకై ్సజ్‌ పోలీసులు అ రెస్టు చేశారు. రఘును విచారించగా విస్తుపోయే ని జాలు వెలుగులోకి రావడం గమనార్హం. భీమ్‌గల్‌లో ని ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల్లో చదువుకుంటు న్న కొందరు విద్యార్థులకు గంజాయి రుచి చూపించిన దుండగులు తమ దందాను యథేచ్చగా కొనసాగిస్తున్నారని తేలింది. దాదాపు 40 మంది విద్యార్థు లు కొన్ని నెలలుగా గంజాయికి బానిసలైనట్లు అధికారులు గుర్తించారు. నిందితుడు ప్రతి వారం గంజా యిని నాందేడ్‌ నుంచి తీసుకువచ్చి విద్యార్థులకు వి క్రయిస్తాడని తెలిసింది. ఒక్కో ప్యాకెట్‌ను రూ.100 కు తీసుకవచ్చి రూ.500లకు విక్రయిస్తుండటంతో అధిక ఆదాయం రావడంతో ప్రతి వారం తీసుకువచ్చేవాడు. అలా నాందేడ్‌కు వెళ్లినప్పుడు కనీసం 10 నుంచి 20 ప్యాకెట్‌లు తీసుకవచ్చి తన దందా కొనసాగించేవాడు. ఇదిలా ఉండగా గంజాయికి బానిసై న విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులను ఎకై ్సజ్‌ స్టేషన్‌కు రప్పించి కౌన్సెలింగ్‌ నిర్వహించారు. వారి లో మార్పు రాకపోతే డీ అడిక్షన్‌ సెంటర్‌కు తప్పనిసరిగా పంపించాలని అధికారులు యోచిస్తున్నారు.

గంజాయిని పూర్తిగా నిర్మూలించాలంటే ప్రజల సహకారం ఎంతో అవసరం. గంజాయి విక్రేతలపైనా, బానిసలపైనా ప్రజలు దృష్టిపెట్టి మాకు, పోలీసులకు సమాచారం అందించాలి. గంజాయి విక్రయించేవారు, వారికి మద్దతు ఇచ్చేవారు ఎంతటివారైనా వదలిపెట్టేది లేదు.

– పి. వేణుమాధవ్‌ రావు,

ఎకై ్సజ్‌ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌, భీమ్‌గల్‌

పెద్దలకు వేరే ముఠా..

పెద్దలకు గంజాయిని వేరే ముఠా సరఫరా చేస్తుండగా, వీరికి కొందరు నాయకుల అండదండలు ఉన్నాయనే ఆరోపణలు ఉన్నాయి. గంజాయి విక్రేతలు ఎక్కడ అరెస్టు అయినా భీమ్‌గల్‌ మండలానికి చెందిన ఒక నాయకుడు అధికారులపై ఒత్తిడి తీసుకవచ్చి వారిని విడిపించడం, కేసులు నమోదు కాకుండా చూసుకోవడం చేసేవాడని సమాచారం. భీమ్‌గల్‌ ప్రాంతంలో రాజకీయ నాయకుల ప్రోద్బలంతోనే గంజాయి దందా సాగడంతో మత్తుకు అడ్డు అదుపు లేకుండా సాగిందనే వాదన వినిపిస్తోంది.

ఇప్పటికై నా అధికారులు పారదర్శకంగా విచారణ చేపట్టి గంజాయి వెనుక దాగి ఉన్న నాయకుల బండారం బయటపెడితేనే ఈ దందాకు చెక్‌ పెట్టవచ్చనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement