
భీమ్‌గల్‌లో పోలీస్ వాహనం ధ్వంసం
మోర్తాడ్(భీమ్‌గల్): భీమ్‌గల్‌లో వినాయక నిమజ్జనం సందర్బంగా పోలీసులు బందోబస్తు నిర్వహించగా తమ వినోదానికి అడ్డు చెప్పారనే కక్షతో ముగ్గురు యువకులు పోలీసుల వాహనంపై రాళ్లు రువ్వి అద్దాలను పగులగొట్టారు. శనివారం రాత్రి చోటు చేసుకున్న ఘటనను దృష్టిలో ఉంచుకున్న ముగ్గురు యువకులు ఆదివారం ఉదయం భీమ్‌గల్ పోలీసుల వాహనంపై రాళ్లు రువ్వారు. ఈ విషయమై ఎస్సై సందీప్ మాట్లాడుతూ.. తమ వాహనంపై రాళ్లతో దాడి చేసి తమ విధులకు ఆటంకం కలిగించిన ముగ్గురు యువకులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.