
ఎస్సారెస్పీ నీటి విడుదల
● 28,500 క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లో
● 8 వరద గేట్ల ద్వారా
12500 క్యూసెక్కులు అవుట్ ఫ్లో
పర్యాటకుల సందడి
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌ను సందర్శించేందుకు ఆ దివారం పర్యాటకులు అధిక సంఖ్యలో తరలివ చ్చారు. డ్యామ్‌పై ఫొటోలు, సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు. జిల్లాతోపాటు నిర్మల్, జగిత్యాల, కరీంనగర్, హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి పర్యాటకులు తరలివచ్చారు.
బాల్కొండ: ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు పెరుగుతుండటంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లోని ఎనిమిది వరద గేట్ల ద్వారా 12,500 క్యూసెక్కుల నీటి విడుదలను అధికారులు ఆదివారం సాయంత్రం ప్రారంభించారు. ఎగువ ప్రాంతాల నుంచి 28,500 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోందని, రాత్రికి మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కాగా, ఎస్సారెస్పీ వరద కాలువకు 18 వేల క్యూసెక్కుల నుంచి 19 వేల క్యూసెక్కులకు నీటి విడుదలను పెంచారు. కాకతీయ కాలువకు 5500, ఎస్కెప్ గేట్ల ద్వారా 2500, సరస్వతి కాలువకు 500, గుత్ప లిఫ్ట్ ద్వారా 270, మిషన్ భగీరథ ద్వారా 231 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. 684 క్యూసెక్కుల నీరు ఆవిరి రూపంలో పోతోంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091(80.5 టీఎంసీలు) అడుగులు కాగా ఆదివారం సాయంత్రానికి నిండుకుండలా ఉంది.
గేట్ల ద్వారా కొనసాగుతున్న నీటి విడుదల

ఎస్సారెస్పీ నీటి విడుదల