
కాంగ్రెస్ నుంచి బీఆర్‌ఎస్‌లో చేరిక
బాన్సువాడ : స్థానిక సంస్థల ఎన్నికల్లో బాన్సువాడలో గులాబీ జెండా ఎగురవేయాలని కార్యకర్తలకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించా రు. సిద్దిపేట జిల్లాలోని కేసీఆర్ ఫాంహౌస్‌లో మా జీ ఎమ్మెల్యే బాజిరెడ్డి ఆధ్వర్యంలో బాన్సువాడ ని యోజకవర్గ కాంగ్రెస్ నాయకులు శుక్రవారం బీఆర్‌ఎస్‌లో చేరారు. బాన్సువాడకు చెందిన మాజీ జెడ్పీటీసీ, మాజీ సర్పంచ్ నార్ల రత్నకుమార్‌తోపాటు ఇషాక్, గులెపల్లి మొగులయ్య, మల్లిబాబుతో పా టు కోటగిరి, వర్ని మండలాలకు చెందిన కాంగ్రెస్ నాయకులకు కేటీఆర్ కండువా కప్పి పార్టీలోకి ఆ హ్వానించారు. బీఆర్‌ఎస్ నాయకులు జుబేర్, అంజిరెడ్డి, యలమంచలి శ్రీనివాస్‌రావు, కోటగిరి శ్రీనివాస్‌రావు, కిషన్, ఎర్రవాటి సాయిబాబా, మోచీ గణేష్, గాండ్ల కృష్ణ, బోడ చందర్, ఉమామహేష్, రమేష్‌యాదవ్, శివసూరి తదితరులున్నారు.