
తులం బంగారం @ రూ.లక్షా10 వేలు
● రికార్డు స్థాయికి చేరిన ధరలు
● శుభకార్యాలు దగ్గర పడుతుండడంతో తలలు పట్టుకుంటున్న సామాన్యులు
నిజామాబాద్ రూరల్: బంగారం ధరలు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పట్లో ఆగేటట్లు కనిపించడం లేదు. తాజాగా మార్కెట్లో బంగారం తులం ధర రూ.లక్షా10 వేలకు చేరుకుంది. వారం రోజుల క్రితం బంగారం తులం రూ.లక్షా 5 వేలు పలికింది. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో పసిడి ధరలు ౖపైపెకి దూసుకెళ్తున్నాయి. పెళ్లిళ్లు, దసరా, దీపావళి పండుగల సీజన్ వేళ బంగారం కొనుగోలు చేసేవాళ్లను ప్రస్తుత ధరలు బెంబేలెత్తిస్తున్నాయి.
వారం రోజుల బంగారం ధరలు
తేదీ ధర(తులం)
30.08.2025 1,05,900,
01.09.2025 1,07,200
02.09.2025 1,07,300
03.09.2025 1,08,400
04.09.2025 1,09,400
05.09.2025 1,10,000