
పటిష్ట నిఘా.. పర్యవేక్షణ
● గణేశ్ శోభాయాత్రకు
1300 మంది సిబ్బంది
● డ్రోన్, సీసీ కెమెరాల ఏర్పాటు
ఖలీల్‌వాడి: గణేశ్ నిమజ్జన శోభాయాత్ర సందర్భంగా నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని సీపీ పోతరాజు సాయిచైతన్య తెలిపారు. శోభాయాత్ర ప్రశాంత వాతావరణంలో కొనసాగేలా చర్యలు తీసుకుంటున్నామననారు. సుమారు 1300 మందికి పైగా సిబ్బందిని నియమించామని, సీసీ కెమెరాలు, నిఘా డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షిస్తున్నామన్నారు. ట్రాఫిక్ నియంత్రణ కోసం పోలీస్ సిబ్బందితోపాటు ఎకై ్సజ్, ఫారెస్ట్, ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్‌తో బందోబస్తు ఏర్పా టు చేశామన్నారు. శోభాయాత్రలో ఎక్కడైనా అనుమానాస్పద రీతిలో వ్యక్తులు, వస్తువులు కనిపిస్తే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని, ఆడియో సిస్టమ్స్‌ను నిర్ణీత స్థాయిలో ఉపయోగించాలన్నారు. డీజేలు పూర్తిగా నిషేధమని, పుకార్లను నమ్మొద్దని సూచించారు. అత్యవసర సమయంలో డయల్ 100, పోలీస్ కంట్రోల్ రూమ్ 87126 59700, సంబంధిత పోలీస్ స్టేషన్‌లలో సంప్రదించాలని అన్నారు.