
డీజేలు సీజ్.. కేసులు నమోదు
ఖలీల్‌వాడి/ రెంజల్/ నవీపేట్/ నందిపేట్: గణేశ్ నిమజ్జనాల్లో డీజేలను నిషేధించినట్లు సీపీ పోతరా జు సాయిచైతన్య బుధవారం తెలిపారు. రెంజల్, నవీపేట్, నందిపేట్‌లో మంగళవారం రాత్రి, బుధవారం గణేశ్ మండపాల్లో పెట్టిన డీజేలను సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. రెంజల్ మండలంలోని కళ్యాపూర్‌లో సోమవారం నిర్వహించిన గణేశ్ నిమజ్జన శోభాయాత్రలో నిర్వాహకులు ఏర్పాటు చేసిన మూడు డీజేలను స్వాధీనం చేసుకొని సీజ్ చేసినట్లు తెలిపారు. అలాగే నవీపేట్ మండలం నిజాంపూర్‌లో మంగళవారం రాత్రి రెండు డీజే సిస్టంలతో పరిమితికి మించి సౌండ్ పెట్టి ప్రజలకు ఇబ్బందికి గురిచేసిన మట్టయ్యఫారానికి చెందిన దారావత్ రమేశ్, షాపూర్‌కు చెందిన పుల్ల అరవింద్‌లపై కేసు నమోదు చేసి డీజేలను సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. నందిపేట్ మండలం అయిలాపూర్‌లో మంగళవారం నిర్వహించిన గణేశ్ నిమజ్జనంలో అధిక సౌండ్‌తో ప్రజలను ఇబ్బందులకు గురిచేసని రెండు డీజేలను సీజ్ నిర్వాహకులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. మండపాల నిర్వాహకులు డీజేలను ఏర్పాటు చేసుకోవద్దని సూచించారు. ఉత్సవాలను ప్రజలు ప్రశాంతంగా జరుపుకోవాలని, విధి నిర్వహణలో ఉన్న పోలీసులకు సహకరించాలని సీపీ కోరారు.

డీజేలు సీజ్.. కేసులు నమోదు

డీజేలు సీజ్.. కేసులు నమోదు