
సులభ బోధనకు టీఎల్‌ఎంలు ఉపయోగకరం
నిజామాబాద్ రూరల్: బోధనాభ్యాసన ఉపకరణాలు విద్యార్థులకు జ్ఞానాన్ని సులభంగా అందించే సాధనాలని డీఈవో అశోక్ అన్నారు. బుధవారం గూపన్‌పల్లి ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన మండల స్థాయి టీఎల్‌ఎం మేళాలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు ప్రదర్శించిన బోధన అభ్యసన ఉపకరణాలను పరిశీలించారు. తరగతి గదిలో విద్యార్థులకు ఏ విధంగా ఉపయోగపడుతుందో ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పది ఉత్తమ టీఎల్‌ఎమ్‌లను ప్రదర్శించిన ఉపాధ్యాయులను సత్కరించారు. కార్యక్రమంలో ఎంఈవో ఎం. సేవుల, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు పొద్దుటూరి మోహన్‌రెడ్డి, ఘనపురం దేవేందర్, మంజులత, జయసాగర్, కృష్ణారెడ్డి, కాంప్లెక్స్ హెచ్‌ఎం హనుమంతరావు, సారంగపూర్ జెడ్పీ ఉన్నత పాఠశాల హెచ్‌ఎం పోశన్న, స్థానిక పాఠశాల హెచ్‌ఎం రమాదేవి, వరప్రసాద్, అంజయ్య, నాయకులు డాక్టర్ సల్ల సత్యనారాయణ, రవీందర్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
సమావేశంలో మాట్లాడుతున్న డీఈవో అశోక్