
అంగన్‌వాడీ పిల్లలకు యూనిఫామ్స్
● జిల్లా వ్యాప్తంగా
81,262 మంది చిన్నారులు
● టీచర్లు, ఆయాలకు మారిన
చీరల రంగులు
నిజామాబాద్‌నాగారం: అంగన్‌వాడీ కేంద్రాలను బ లోపేతం చేసేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తుంది. అందులో భాగంగా ఆరేళ్లలోపు చిన్నారులకు యూనిఫామ్స్ అందించేందుకు సిద్ధమైంది. ఇప్పటికే జిల్లా సంక్షేమాధికారి కార్యాలయానికి యూనిఫామ్ క్లాథ్‌ను సరఫరా చేసింది. జిల్లాలో బోధన్, నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, భీమ్‌గల్, ఆర్మూర్ సీడీపీవో కార్యాలయాలు ఉండగా, వాటి పరిధిలో 1501 అంగన్‌వాడీ కేంద్రాలు నడుస్తున్నాయి. వీటిలో 81,262 మంది పిల్లలు చదువు తున్నారు. గతేడాది 30 శాతం చిన్నారులకే యూని ఫామ్స్ రాగే, ఈ ఏడాది మాత్రం 100శాతం పిల్లలకు పంపిణీ చేసేందుకు క్లాథ్‌ను సిద్ధం చేశారు. ఒక్కొక్కరికి రెండు జతల చొప్పున పిల్లల కొలతల ఆధారంగా కుట్టించి త్వరలోనే పంపిణీ చేయనున్నా రు. కాగా, డీఆర్‌డీవో సహకారంతో మహిళా సంఘాల సభ్యులతో యూనిఫామ్స్ కుట్టించనున్నారు.
2,328 మందికి చీరలు
యూనిఫామ్స్ కచ్చితంగా ధరించాలి
జిల్లాలోని టీచర్లు, ఆయాలు కచ్చితంగా యూనిఫామ్స్ ధరించి విధులకు హాజరుకావాలి. అంగన్‌వాడీకి వచ్చే పిల్లలందరికీ రెండు జతల చొప్పున యూనిఫామ్స్ త్వరలోనే అందజేస్తాం.
– రసూల్‌బీ, జిల్లా సంక్షేమాధికారిణి
అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలకు గత కొన్నేళ్లుగా ఒకే రకమైన చీరలను ప్రభుత్వం పంపిణీ చేసేది. ఐతే ఈ సంవత్సరం చీరల రంగులు మారాయి. జిల్లాలో 1,427 అంగన్‌వాడీ టీచర్లు, 901 మంది ఆయాలు పనిచేస్తున్నారు. ఒక్కొక్కరికి రెండు జతల చొప్పున చీరలు, బ్లౌజులు అందజేశారు.

అంగన్‌వాడీ పిల్లలకు యూనిఫామ్స్