
వరద బాధితులను ఆదుకుంటాం
● రూ.మూడున్నర కోట్లతో రోడ్లు,
వంతెనలకు మరమ్మతులు
● రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి
సిరికొండ/ధర్పల్లి: కప్పలవాగు వరదతో నష్టపోయిన బాధితులను అన్నివిధాలా ఆదుకుంటామని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి తెలిపారు. ధర్పల్లి మండలం వాడి, సిరికొండ మండలంలోని పెద్దవాల్గోట్, కొండూర్, గడ్కోల్, తూంపల్లి, పాకాల, కొండాపూర్, ముషీర్‌నగర్ గ్రామాల్లో బుధవారం ఆయన పర్యటించారు. ఆయా గ్రామా ల్లో వర్షానికి కోతకు గురైన రోడ్లు, దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. కొండూర్‌లో వరద ముంచె త్తి నిరాశ్రయులైన బాధితులను పరామర్శించి ఓదార్చారు. ఇళ్లు కూలిన వారికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం కొండూర్‌లో మీడియాతో మాట్లాడారు. ముత్యాల చెరు వు కట్ట తెగిపోవడం, 30 సెం.మీ వర్షం కురవడంతో భారీ నష్టం ఏర్పడిందన్నారు. 55 ఇళ్లు పూర్తిగా కూలిపోయి, సామగ్రి అంతా కొట్టుకుపోవడంతో బాధితులకు ఆస్తి నష్టం వాటిల్లినట్లు వెల్లడించారు. మూడున్నర కోట్లతో రోడ్లు, వంతెనలకు మరమ్మతులు చేయిస్తున్నట్లు తెలిపారు. ఎంపీ అర్వింద్ చేసి న విమర్శలు బాధ్యతారాహిత్యంగా ఉన్నాయన్నా రు. వర్షాలతో జరిగిన నష్టాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లి నిధులు తేవాల్సింది పోయి రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడం సరికాదన్నారు. బీఆర్‌ఎస్ నుంచి కవిత సస్పెన్షన్ వారి కుటుంబ డ్రామా అని విమర్శించారు. అనంతరం పాకాలలో మాజీ సర్పంచ్ కీరిబాయి, కొండూర్‌లో పార్టీ నాయకుడు చెల్లెం నడ్పి గంగయ్య కుటుంబాలను ఎమ్మెల్యే పరామర్శించారు. కార్యక్రమంలో నాయకులు వెల్మ భాస్కర్‌రెడ్డి, శేఖర్‌గౌడ్, ఉమ్మజీ నరేశ్, ఎర్రన్న, బాకారం రవి, సొసైటీ చైర్మన్ గంగాధర్, దేగాం సాయన్న, దశరథ్‌రెడ్డి, సంతోష్‌నాయక్, బాల్‌సింగ్, భానుచందర్, దేవరాజు, శ్రీధర్, జగన్, బుచ్చన్న, రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.