కవిత వ్యాఖ్యలు బాధాకరం | - | Sakshi
Sakshi News home page

కవిత వ్యాఖ్యలు బాధాకరం

Sep 4 2025 5:49 AM | Updated on Sep 4 2025 5:49 AM

కవిత వ్యాఖ్యలు బాధాకరం

కవిత వ్యాఖ్యలు బాధాకరం

ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి

వేల్పూర్‌: మాజీ మంత్రి హరీశ్‌ రావు, జోగినపల్లి సంతోష్‌కుమార్‌పై కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలు బాధాకరమని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి బుధవారం రాత్రి మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. కేసీఆర్‌ నాయకత్వంలో ఉద్యమం అయినా, పాలన అయినా ప్రజల క్షేమం కోసం, పార్టీ కోసం, తెలంగాణ కోసం హరీశ్‌ రావు నిర్విరామంగా కృషి చేశారని తెలిపారు. కేసీఆర్‌ వెన్నంటి ఉంటూ 25 సంవత్సరాలుగా నిస్వార్థంగా పార్టీ కోసం సంతోష్‌కుమార్‌ పాటుపడుతున్నారని తెలిపారు. అటువంటి వారి వ్యక్తిత్వం, కమిట్‌మెంట్‌పై కవిత విమర్శలు చేయడం బాధాకరమని పేర్కొన్నారు.

తగ్గిన నీటి విడుదల

ఎస్సారెస్పీలోకి లక్షా 16 వేల

క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

బాల్కొండ: శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌లోకి ఎగు వ ప్రాంతాల నుంచి ఇన్‌ఫ్లో తగ్గుముఖం ప ట్టడంతో వరద గేట్ల ద్వారా నీటి విడుదలను అధికారులు తగ్గించారు. ఎగువ లక్షా 16 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, 23 గే ట్ల ద్వారా లక్ష క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. వరద కాలువ ద్వారా 18 వేలు, కాకతీయకాలువ ద్వారా 4500, ఎస్కేప్‌ గేట్ల ద్వారా 3500 క్యూసెక్కు ల నీటిని విడుదల చేస్తుండగా, మిషన్‌ భగీరథ అవసరాలకు 231 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నా రు. ఆవిరి రూపంలో 666 క్యూసెక్కుల నీరు పోతోంది. ప్రాజెక్ట్‌ పూర్తి స్థాయి నీటి మట్టం 1091(80.5 టీఎంసీలు) అడుగులు కాగా బుధవారం సాయంత్రానికి 1089.9(76.10 టీఎంసీలు) అడుగుల నీరు నిల్వ ఉందని అధికారులు తెలిపారు.

ప్రతిభను వెలికి

తీసేందుకు ‘కళా ఉత్సవ్‌’

నిజామాబాద్‌అర్బన్‌: విద్యార్థుల్లో దాగి ఉన్న కళా ప్రతిభను వెలికితీసేందుకు జిల్లాస్థాయి కళా ఉత్సవ్‌ సాంస్కృతిక పోటీలు ఎంతో దోహదం చేస్తాయని డీఈవో అశోక్‌ పేర్కొన్నారు. నగరంలోని బాల్‌ భవన్‌లో బుధవారం కళా ఉత్సవ్‌ కార్యక్రమం నిర్వహించారు. రెండు రోజులపాటు గ్రూప్‌ డ్యా న్స్‌, సోలో డ్యాన్స్‌, గ్రూప్‌ సాంగ్స్‌, సోలో సాంగ్‌, స్కిట్‌, 2డీ , 3డీ డ్రాయింగ్‌ తదితర పోటీలు నిర్వహించనున్నట్లు డీఈవో తెలి పారు. ఏఎంవో బాలకృష్ణారావు, అర్బన్‌ ఎంఈవో సాయిరెడ్డి, జ్యూరీ కమిటీ మెంబ ర్స్‌ లక్ష్మీనాథం, ఆర్‌.గోపాలకృష్ణ, కాసర్ల నరేశ్‌రావు, లక్ష్మణ్‌, చింతల శ్రీనివాస్‌, డాక్ట ర్‌ శారద, న్యాయ నిర్ణేతలు పాల్గొన్నారు.

నేడు వైన్‌షాపులు బంద్‌

ఖలీల్‌వాడి: వినాయక నిమజ్జనం సందర్భంగా జిల్లాలో వైన్‌ షాపులు, కల్లు దుకాణాలు, బార్‌లను గురువారం మూసివేయనున్నట్లు సీపీ సాయిచైతన్య బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం ఉదయం 6గంటల నుంచి శుక్రవారం ఉదయం 6గంటల వరకు వైన్స్‌లు, బార్‌లు, కల్లు దుకాణాలను మూసి ఉంచాలని, లేనిపక్షంలో చర్యలు తప్పవని ఆయన స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement