
రైతులకు న్యాయం చేస్తాం
నవీపేట: వరద నీటి ఉధృతితో పంట నష్టపోయిన రైతులకు న్యాయం చేస్తామని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి భరోసా ఇచ్చారు. మండలంలోని నాళేశ్వర్, తుంగిని, బినోల గ్రామాలలో ఆయన పర్యటించా రు. రైతులతో మాట్లాడి పంట నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు. బినోలాలో విలేకరులతో మాట్లాడారు. ఎస్సారెస్పీలో ఎగువ ప్రాంతం నుంచి వరద ఉధృతి పెరగడంతో ప్రతి సంవత్సరం నది తీరంలోని పంటలు నీట మునుగుతాయని, కానీ ఎన్నడూ పంటలకు నష్టం చేకూరలేదన్నారు. ఈసా రి ఉధృతి రెట్టింపవడంతో నాలుగు రోజులకు మించి పంటలు నీటిలో మునిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. నష్టపోయిన రైతుల వివరాలను సేకరించా లని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. బినోలా శివారులో 67 ట్రాన్స్‌ఫార్మర్లు, 10 విద్యుత్ స్తంభాలు ధ్వంసమయ్యాయని, వెంటనే వాటికి మరమ్మతులు చేపట్టాలని ట్రాన్స్‌కో అధికారులకు సూచించారు. ఆయన వెంట ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, నిజామాబాద్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ జంగిటి రాంచందర్, నాయకులు శ్రీనివాస్ గౌడ్, గోవర్ధన్‌రెడ్డి, బాల్‌రాజుగౌడ్, సంజీవ్‌రెడ్డి, నర్సింగ్‌రావ్, చిన్నదొడ్డి ప్రవీన్, సంజీవ్‌రావ్, సాయారెడ్డి తదితరులు ఉన్నారు.
● బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి
బినోలాలో వరి పైరును పరిశీలిస్తున్న ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి