
సమాచార హక్కు చట్టం వజ్రాయుధం
నిజామాబాద్ నాగారం: సమాచార హక్కు చట్టం ప్రజలకు వజ్రాయుధమని సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ సలీం అన్నారు. నగరంలోని ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం సమాచార హక్కు చట్టం – 2005 పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించి కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సలీం మాట్లాడుతూ.. అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో సమాచార హక్కు బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. చట్టం పరిధిని అంతర్జాతీయ స్థాయిలో విస్తరించాలన్నారు.
జిల్లా కార్యవర్గం
సమాచార హక్కు చట్టం పరిరక్షణ కమిటీ జిల్లా అధ్యక్షుడిగా కాంతపు గంగాధర్, మహిళా విభాగం అధ్యక్షురాలిగా వై సునీత, న్యాయ విభాగం సలహాదారులుగా శ్యామల, కార్యదర్శిగా రషీదా, ముఖ్య సలహాదారులుగా మహ్మద్, బోధన్ డివిజన్ అధ్యక్షురాలిగా తస్లీమ్, రాష్ట్ర స్పోక్స్ పర్సన్‌గా న్యాయవా ది శ్రీనివాసరావును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.