
పంటలను పరిశీలించిన శాస్త్రవేత్తలు
రెంజల్/ నవీపేట్: ఇటీవల కురిసిన వర్షాలు, వరదలతో నీట మునిగిన వరి, సోయా పంటలను సోమవారం రుద్రూర్ ప్రాంతీయ చెరుకు, వరి పరిశోధన స్థానం శాస్త్ర వేత్తలు పరిశీలించారు. రెంజల్ మండలం తాడ్‌బిలోలి, బోర్గాం, కందకుర్తి, నవీపేట మండలంలోని నందిగామ, అల్జాపూర్ గ్రామాలను సందర్శించి వరి రైతులకు సూచనలు, సలహాలు అందించారు. వరద నీటిలో ముంపునకు గురైన పొలాలకు మురుగు నీటి కాల్వల ద్వారా నీటిని తీసి వేసుకోవాలని రుద్రూర్ పరిశోధనా స్థానం అధిపతి సమతా పరమేశ్వరి, శాస్త్ర వేత్తలు సాయిచరణ్, రమ్యరాథోడ్ సూచించారు. పలు అంశాలపై సూచనలు చేశారు. వారి వెంట రెంజల్ మండల ఇన్‌చార్జి వ్యవపాయాధికారి సిద్ధిరామేశ్వర్, నవీపేట ఏవో నవీన్‌కుమార్, ఏఈవోలు, రైతులు ఉన్నారు.