
యంగ్ సైంటిస్ట్ పోటీలో ప్రతిభ చూపిన విద్యార్థి
మోపాల్: స్పేస్ కిడ్స్ ఇండియా ఆధ్వర్యంలో చెన్నయ్‌లో ఇటీవల జరిగిన గ్రాండ్ ఫినాలే యంగ్ సైంటిస్ట్ ఇండియా పోటీల్లో బోర్గాం(పి) జెడ్పీహెచ్‌ఎస్ 10వ తరగతి విద్యార్థి సైని కార్తీక్ తన ప్రదర్శనలతో ప్రతిభ కనబర్చారు. సోలార్ పవర్‌తో వాటర్ ఫ్యూరిఫైర్, వ్యవసాయ వ్యర్థాలతో బయో ప్లాస్టిక్‌ను, బయో ప్లాస్టిక్‌తో రోడ్డును తయారు చేసిన ప్రాజెక్టును సైని కార్తీక్ ప్రదర్శించాడు. ఈ రోడ్డు నీటిని పీల్చుకుని భూగర్భజలాల మట్టాన్ని పెంచుతుంది. ప్రదర్శనలో మొత్తం 95 పాఠశాలలు పాల్గొనగా, బోర్గాం(పి) జెడ్పీహెచ్‌ఎస్ విద్యార్థి ఉత్తమ ప్రతిభ కనబర్చడంతో మెమోంటో, మెడల్, సర్టిఫికెట్‌తో సైని కార్తీక్, గైడ్‌టీచర్ కే అనుపమను సత్కరించారు. విద్యార్థి, గైడ్ టీచర్‌ను పాఠశాల హెచ్‌ఎం శంకర్, ఉపాధ్యాయులు సోమవారం అభినందించారు.
ఆశావర్కర్ల అరెస్టు దారుణం
నిజామాబాద్ సిటీ : సమస్యల పరిష్కారానికి చలో హైదరాబాద్ తరలివెళ్తున్న ఆశావర్కర్లను ప్రభు త్వం అరెస్టు చేయడం దారుణమని సీఐటీయూ జి ల్లా కార్యదర్శి నూర్జహన్ తెలిపారు. నగరంలోని ఆశావర్కర్లను అరెస్టుచేసి తర్వాత పూచీకత్తుపై విడుదల చేశారు. ఈసందర్భంగా నూర్జహన్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని, ఆశావర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు.అక్రమ అ రెస్టులతో ఉద్యమాలను ఆపలేరన్నారు.ఆశావర్కర్లు రేణుక,లలిత,విజయ, సుకన్య, రేఖ,శోభ, సీహెచ్ నర్స లక్ష్మీ, సలీమా, సరూప, రాధా, రమా, పద్మ, బాలమణి, స్వప్న, రేవతి, విజయ, సాహిర, ఆసియా, లావణ్య, వనిత, దివ్య, సబిత, ఇందిర, లత, భాగ్య, రేణుక, చంద్రకళ, భారతి, చందన తదితరులున్నారు.

యంగ్ సైంటిస్ట్ పోటీలో ప్రతిభ చూపిన విద్యార్థి