
పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి
నిజామాబాద్‌అర్బన్/మోపాల్: సీపీఎస్‌ను రద్దు చేయాలని పీఆర్టీయూ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ధర్నా చౌక్ వద్ద నిర్వహించిన మహాధర్నాకు జిల్లా ఉపాధ్యాయులు తరలివెళ్లారు. జిల్లా పీఆర్టీ యూ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మోహన్ రెడ్డి కిషన్, జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు అంకం నరేశ్, ఆర్మూర్, ధర్పల్లి పీఆర్టీయూ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు గోపాల్ వెంకటరాజారెడ్డి సతీష్ నాయకులు వెంకటేశ్వర గౌడ్ జలంధర్ సంతోష్ భార్గవ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు మోహన్ రెడ్డి మాట్లాడుతూ జిల్లా నుంచి దాదాపుగా 1500 మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారని పేర్కొన్నారు. పాత పెన్షన్ విధానాన్ని వెంటనే అమల్జేయాలని తెలంగాణ టీచర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు లాటికర్ రాము డిమాండ్ చేశారు. ఈమేరకు మండలంలోని సిర్‌పూర్ జెడ్పీహెచ్‌ఎస్‌లో కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్)కు వ్యతిరేకంగా టీటీయూ ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీలు ధరించి, ఫ్లకార్డులు పట్టుకుని ఉపాధ్యాయులు నిరసన తెలియజేశారు. ఉపాధ్యాయులు మోహన్, హజారే శ్రీనివాస్, అక్బర్ బాషా, నరేష్‌రావు తదితరులున్నారు.