
డిజిటల్ క్రాప్ సర్వే షురూ
● వెబ్‌సైట్‌ను తెరిచిన ప్రభుత్వం
● సర్వే నంబర్ల వారీగా వివరాల నమోదు
డొంకేశ్వర్(ఆర్మూర్): జిల్లాలో నెల రోజులు ఆలస్యంగా డిజిటల్ క్రాప్ సర్వే మొదలైంది. ప్రభుత్వం డీసీఎస్ వెబ్‌సైట్‌ను తెరవడంతో వ్యవసాయ విస్తీర్ణ అధికారులు (ఏఈవోలు) క్షేత్రస్థాయికి వెళ్లి వానాకాలంలో సాగవుతున్న పంటల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. అక్టోబర్ 20వ తేదీ వ రకు పంట వివరాల నమోదు పూర్తి చేయాలని ప్ర భుత్వం గడువు విధించింది. ఇటీవల భారీ వర్షాల కారణంగా జిల్లాలో సుమారు 50వేల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. రైతులకు నష్టపరిహారం అందించాలంటే తప్పనిసరిగా క్రాప్ బుకింగ్ చేసి ఉండాలి. దీంతో ఏఈవోలు, ఏవోలు ఆగమేఘాల మీద సర్వే నంబర్ల వారీగా పంటల వివరాలను న మోదు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం ఖ రీఫ్ సీజన్‌లో పసుపు పంట మినహాయించి వివిధ ప్రధాన పంటలు 5,24,506 ఎకరాల్లో సాగవుతుండగా, అత్యధికంగా 4,36,695 ఎకరాల విస్తీర్ణంలో వరి ఉంది. ప్రభుత్వం పంటలను కొనుగోలు చే యాలన్నా, నష్టపోయిన పంటలకు పరిహారం ఇవ్వాలన్నా డిజిటల్ క్రాప్ సర్వేలో పంటల వివ రాలు తప్పనిసరిగా ఉండాలి. వరి, సోయా, ఇతర పంటలకు ఇంకా సమయం ఉండగా, చాలా ప్రాంతాల్లో మొక్కజొన్న కోత దశకు వచ్చింది. తప్పులు లేకుండా పంటల సర్వే నిర్వహించాలని ఏఈవోలకు సూచించినట్లు జిల్లా వ్యవసాయాధికారి మేకల గోవింద్ ‘సాక్షి’కి తెలిపారు.