
నష్టం వివరాలు అందించండి
నిజామాబాద్‌అర్బన్: భారీ వర్షాల కారణంగా వాటిల్లిన నష్టంపై సమగ్ర వివరాలతో వెంటనే అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. భారీ వర్షాలు, వరద సహాయంపై సెక్రటేరియట్ నుంచి సోమవారం వీడియోకాన్ఫరెన్స్ ద్వారా సీఎం సోమవారం సమీక్షించారు. వరద ప్రభావం, ప్రస్తుత పరిస్థితులను తెలుసుకున్నారు. తక్షణ సహాయక చర్యల కోసం నిధులు మంజూరు చేస్తున్నామని వెల్లడించారు. విపత్తు సహాయ నిధిని కూడా అవసరాల కోసం వినియోగించుకోవాలని సూచించారు. వరదల కారణంగా మృతి చెందిన వారి కుటుంబాలకు వెంటనే నష్ట పరిహారం అందించాలని ఆదేశించారు. మరో నెల రోజుల వరకు ఇదే రీతిలో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నా యని వాతావరణ శాఖ పేర్కొంటున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పరిస్థితిని పర్యవేక్షించాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, ఆయా శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.
వరదల్లో మృతి చెందిన వారి
కుటుంబాలకు పరిహారం
విపత్తు సహాయనిధిని
వినియోగించుకోండి
తక్షణ సహాయక చర్యల కోసం నిధులు మంజూరు
వీడియో కాన్ఫరెన్స్‌లో
సీఎం రేవంత్‌రెడ్డి