
అతివల్లో అక్షర కాంతి కోసం..
నిజామాబాద్‌అర్బన్: అతివలందరినీ అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంకల్పించాయి. జాతీయ విద్యా విధానం–2020కి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ఉల్లాస్(అండర్ స్టాండింగ్ ఆఫ్ లైఫ్‌లాంగ్ లెర్నింగ్ ఫర్ ఆల్ ఇన్ సొసైటీ)ను రూపొందించింది. అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 8వ తేదీన ‘నవభారత సాక్షరత’ పేరిట కార్యక్రమాన్ని ప్రారంభించనుంది.
వలంటీర్ల ద్వారా బోధన
ఉల్లాస్ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 59,049 మంది మహిళా నిరక్షరాస్యులను అధికారులు గు ర్తించారు. అందులో 45,158 మంది మహిళల వివరాలను యాప్‌లో నమోదు చేశారు. కార్యక్రమానికి రిసోర్స్ పర్సన్లుగా ప్రభుత్వ ఉపాధ్యాయులను ఎంపిక చేశారు. వీరి పర్యవేక్షణలోనే ఉల్లాస్ కార్యక్రమం అమలు కానుంది. జిల్లా రిసోర్స్ పర్సన్లుగా నియమితులైన శ్రీనివాస్‌గౌడ్, రాజేశ్ రాష్ట్రస్థాయిలో శిక్షణ పొందారు. వీరు 66 మంది మండల రిసోర్స్ పర్సన్లకు, వారి ద్వారా మండల స్థాయి వయోజన వలంటీర్లకు శిక్షణ ఇవ్వనున్నారు. గ్రామస్థాయిలో 10 మంది నిరక్షరాస్యులకు ఒక వలంటీర్‌ను నియమించి చదువు నేర్పనున్నారు.
ఈనెల 8న ఉల్లాస్ ప్రారంభం
జిల్లాలో 59,049 మంది మహిళా
నిరక్షరాస్యుల గుర్తింపు
చదువు నేర్పేందుకు 10 మందికి
ఒక వలంటీర్