
యూరియా కోసం బారులు
సిరికొండ: మండల రైతులను యూరియా కష్టాలు వెంటాడుతున్నాయి. మండల కేంద్రంలోని సొసైటీకి వచ్చిన 300 సంచుల యూరియా కోసం రైతులు బారులు తీరారు. రైతు వేదిక వద్ద పట్టా పాస్ పుస్తకం జిరాక్స్ తీసుకొని వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు టోకెన్లు ఇచ్చారు. ఆ టోకెన్ పట్టుకొని వచ్చి రైతులు సొసైటీ కార్యాలయం వద్ద వరుసలో నిలుచున్నారు. ఎంత భూమి ఉన్నా ఒక్క రైతుకు మూడు సంచులు మాత్రమే పంపిణీ చేశారు. సిరికొండ సొసైటీ పరిధిలోని సిరికొండ, మైలారం, చీమన్‌పల్లి, పందిమడుగు, దుప్య తండా, హుస్సేన్‌నగర్, న్యావనంది, రావుట్ల గ్రామాలకు చెందిన రైతులు భారీగా తరలివచ్చారు.