ప్రజావాణి అర్జీలకు ప్రాధాన్యత ఇవ్వాలి | - | Sakshi
Sakshi News home page

ప్రజావాణి అర్జీలకు ప్రాధాన్యత ఇవ్వాలి

Sep 2 2025 6:48 AM | Updated on Sep 2 2025 6:48 AM

ప్రజా

ప్రజావాణి అర్జీలకు ప్రాధాన్యత ఇవ్వాలి

జిల్లా అధికారులను ఆదేశించిన

కలెక్టర్‌ వినయ్‌ కృష్ణారెడ్డి

74 వినతుల స్వీకరణ

నిజామాబాద్‌అర్బన్‌:ప్రజా సమస్యల పరిష్కారాని కి ప్రభుత్వం చేపట్టిన ప్రజావాణి కార్యక్రమం ద్వా రా అందిన దరఖాస్తులకు ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి జిల్లా అధికారులను ఆదే శించారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయా ల సముదాయంలోని ప్రధాన సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదన పు కలెక్టర్లు అంకిత్‌, కిరణ్‌ కుమార్‌తో కలిసి కలెక్టర్‌ ప్రజావాణి ఫిర్యాదులను స్వీకరించారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖల జిల్లా అధికారు లు తప్పనిసరిగా హాజరు కావాలన్నారు. అత్య వస రమైతే తన అనుమతి తీసుకుని, తమ కింది స్థాయి అధికారిని ప్రజావాణికి పంపాలని సూచించారు. అ నంతరం ప్రజావాణికి 74 వినతులు రాగా వాటి ప రిష్కారానికి సంబంధిత అధికారులకు అందించా రు.ఎంతో కీలకంగా భావించే ప్రజావాణికి జిల్లా అ ధికారులు గైర్హాజరు కాకూడదని సూచించారు. ప్ర జావాణి ఫిర్యాదులకు ప్రాధాన్యతనిస్తూ, త్వ రితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీఆర్డీవో సాయాగౌడ్‌, నగరపాలక సంస్థ కమిషనర్‌ దిలీప్‌ కుమార్‌, డీపీవో శ్రీనివాస్‌ రావు, మెప్మా పీడీ రాజేందర్‌, ఏసీపీ రాజావెంకట్‌రెడ్డి, కలెక్టరేట్‌ ఏవో ప్రశాంత్‌,వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

వేతనాలు ఇప్పించండి

జిల్లాలోని మోడల్‌ స్కూల్‌లో పనిచేస్తున్న సిబ్బందికి ఆరు నెలలుగా వేతనాలు లేవని వేతనాలు ఇప్పించాలని ప్రజావాణిలో కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. టీపీటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు వెనిగళ్ల సురేశ్‌ ఆధ్వర్యంలో ఉద్యోగులు కలెక్టర్‌ను కలిసి విన్నవించారు.

పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో ధర్నా

పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ పీడీఎస్‌యూ నాయకులు కలెక్టరేట్‌ ప్రవేశ మార్గం వద్ద ధర్నా నిర్వహించారు. అలాగే ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలు శిథిలావస్థలో ఉన్నాయని మరమ్మతులు చేపట్టాలని జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నరేందర్‌, గణేశ్‌ డిమాండ్‌ చేశారు. జూనియర్‌ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలన్నారు.

కుక్కల బెడదను నివారించండి

సారంగపూర్‌లోని కుక్కల బెడదను నివారించాలని గ్రామానికి చెందిన శ్రీ స్వామి వివేకానంద యూత్‌ సభ్యులు కలెక్టర్‌ను కలిసి విన్నవించారు.రోడ్డు ఎక్కాలంటే భయపడుతున్నామని వారు పేర్కొన్నారు.

బార్‌ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలి

ఆర్టీసీ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన బార్‌ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. నివాస గృహాల మధ్య ఏర్పాటు చేశారని వెంటనే తొలగించాలన్నారు. కిచెన్‌ షెడ్డు నుంచి పొగ, దుర్వాసన ఇళ్లల్లోకి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. చుట్టుపక్కల పాఠశాలలు, బ్యాంకులు ఉన్నాయని మహిళలకు ఇబ్బందికరంగా ఉందన్నారు. డబుల్‌ బెడ్‌రూమ్‌లను కేటాయించండి పేదలకు డబుల్‌ బెడ్‌ రూమ్‌లను వెంటనే కేటాయించాలని అంకాపూర్‌ గ్రామస్తులు డిమాండ్‌ చేశారు. గ్రామానికి చెందిన పేదవారికి ఇళ్లు ఇచ్చేందుకు గతంలో అర్హులుగా గుర్తించారని, ఇళ్లు మాత్రం ఇవ్వడం లేదన్నారు. అనంతరం వారు ప్రజావాణిలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.

ప్రజావాణి అర్జీలకు ప్రాధాన్యత ఇవ్వాలి 1
1/2

ప్రజావాణి అర్జీలకు ప్రాధాన్యత ఇవ్వాలి

ప్రజావాణి అర్జీలకు ప్రాధాన్యత ఇవ్వాలి 2
2/2

ప్రజావాణి అర్జీలకు ప్రాధాన్యత ఇవ్వాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement