కాళోజీ పురస్కారానికి మొగిల్‌ స్వామిరాజ్‌ ఎంపిక | - | Sakshi
Sakshi News home page

కాళోజీ పురస్కారానికి మొగిల్‌ స్వామిరాజ్‌ ఎంపిక

Sep 2 2025 6:48 AM | Updated on Sep 2 2025 6:48 AM

కాళోజీ పురస్కారానికి  మొగిల్‌ స్వామిరాజ్‌ ఎంపిక

కాళోజీ పురస్కారానికి మొగిల్‌ స్వామిరాజ్‌ ఎంపిక

కాళోజీ పురస్కారానికి మొగిల్‌ స్వామిరాజ్‌ ఎంపిక పీజీ పరీక్షల్లో ఒకరి డిబార్‌

బోధన్‌: తెలంగాణ రచయితల సంఘం తొమ్మిదేళ్లుగా ప్రధానం చేస్తున్న కాళోజీ పురస్కారం 2024–25నకు గాను బోధన్‌కు చెందిన అ భ్యుదయ కవి మొగిలి స్వామిరాజ్‌ ఎంపికయ్యారు.ఈ విషయాన్ని సోమవారం ఆయన తెలిపారు. కవి మొగిలి స్వామిరాజ్‌ సమకాలిన సామాజిక అంశాలపై అనేక కవితలు రాశారు. నిశబ్ధ రహస్యాలు, నిప్పు కణికలు స్వీయ రచనలతో కవితా సంపుటాలు వెలువరించి ఉమ్మ డి జిల్లా, రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందారు. త్వరలో పురస్కార ప్రధానోత్సవ కార్యక్రమం జరుగనుందని స్వామి రాజ్‌ తెలిపారు.

తెయూ(డిచ్‌పల్లి): తెయూ పరిధిలో కొనసాగుతున్న పీజీ, బీఈడీ, బీపీఎడ్‌ సెమిస్టర్‌ పరీక్షల్లో సోమవారం ఒక విద్యార్థి మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడుతూ డిబార్‌ అయినట్లు ఆడిట్‌ సెల్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ ఘంటా చంద్రశేఖర్‌ తెలిపారు. ఉదయం నిర్వహించిన పీజీ 2, 4వ సెమిస్టర్‌ రెగ్యులర్‌, బ్యాక్‌లాగ్‌ పరీక్షల్లో మొత్తం 744 మందికి 688 మంది హాజరు కాగా 55 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు ఆయన పేర్కొన్నారు. నగరంలోని గిరిరాజ్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల పరీక్షా కేంద్రంలో మాల్‌ ప్రాక్టీస్‌కు పాల్పడుతూ ఒకరు డిబార్‌ అయినట్లు తెలిపారు. మధ్యాహ్నం నిర్వహించిన బీఈడీ, బీపీఎడ్‌ 2, 4వ సెమిస్టర్‌ రెగ్యులర్‌, బ్యాక్‌లాగ్‌ పరీక్షల్లో మొత్తం 129 మందికి 115 మంది హాజరు కాగా 14 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు ఆయన పేర్కొన్నారు.

దరఖాస్తుల ఆహ్వానం

నిజామాబాద్‌నాగారం: జిల్లాలోని శారీరక దివ్యాంగ బాలుర విద్యార్థులు ఉచిత విద్య, వసతి కోసం దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా సంక్షేమ, మహిళా, శిశు, దివ్యాంగుల వయోవృద్ధుల శాఖ అధికారి రసూల్‌బీ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 1 నుంచి 10వ తరగతి వరకు చదివే వారికి న్యాల్‌కల్‌ రోడ్‌లోని ఆనంద నిలయంలో వసతి కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. సీట్లు భర్తీ కాకపోతే ఇంటర్‌, ఆపై చదివే వారికి అవకాశం ఉంటుందని తెలిపారు. ఆసక్తి గల అర్హులైన దివ్యాంగ విద్యార్థులు కలెక్టరేట్‌లోని కార్యాలయంలో సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు శారీరక దివ్యాంగ విద్యార్థులను వసతి గృహంలో చేర్పించేందుకు సహకరించాలన్నారు. వివరాలకు 9703723632 నంబర్‌లో సంప్రదించాలని తెలిపారు.

జీజీ కళాశాలలో..

నిజామాబాద్‌అర్బన్‌: నగరంలోని గిరిరాజ్‌ ప్ర భుత్వ డిగ్రీ కళాశాలలో గెస్ట్‌ ఫ్యాకల్టీ ప్రాతిపదికన అధ్యాపక పోస్టుల కోసం అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపాల్‌ రామ్మోహన్‌ రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. యూజీ కోర్సుల్లో బోధన కోసం అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలన్నారు. పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌, ఎకనామిక్స్‌, హిస్టరీ సబ్జెక్టులలో అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని, సంబంధిత విభాగంలో పీజీలో 55 శాతం ఉత్తీర్ణత ఉండాలన్నారు. పీహెచ్‌డీ, నెట్‌, సెట్‌ ఉత్తీర్ణులకు ప్రాధాన్యత ఉంటుంద న్నారు. కళాశాలలో బుధవారం ఉదయం 10 గంటలకు నిర్వహించే ఇంటర్వ్యూకు అభ్య ర్థులు హాజరు కావాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement