
పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి
తెయూ(డిచ్‌పల్లి): పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని తెలంగాణ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్(టూటా) అధ్యక్షుడు పున్నయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీపీఎస్ విధానం స్వచ్ఛందంగా ఎంచుకొనేందుకు కేంద్రం అవకాశం ఇచ్చినప్పటికీ చాలా రాష్ట్రాలు పోటీపడి నూతన పెన్షన్ విధానాన్ని ఎంపిక చేసుకున్నాయని అన్నా రు. తెలంగాణ రాష్ట్రంలో గత ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం టూటా ఆధ్వర్యంలో తెయూ వీసీ యాదగిరిరావుకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో టూటా వైస్ ప్రెసిడెంట్ సత్యనారాయణ రెడ్డి, అడికె నాగరాజు, ప్రొఫెసర్ రాంబాబు గోపిశెట్టి, పాత నాగరాజు, వాసం చంద్రశేఖర్, మహేందర్ రెడ్డి, రాజేశ్వరి, బాలకిషన్, శిరీష బోయపాటి, సంపత్ తదితరులు పాల్గొన్నారు.
నిరసన తెలిపిన నాన్ టీచింగ్ ఉద్యోగులు
సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం తెలంగాణ యూనివర్సిటీ పరిపాలనా భవనం ఎదుట నల్లబ్యాడ్జీలు ధరించి నాన్ టీచింగ్ ఉద్యోగులు నిరసన కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో నాన్ టీచింగ్(రెగ్యులర్) ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు అసిస్టెంట్ రిజిస్ట్రార్ బి.సాయాగౌడ్, జనరల్ సెక్రెటరీ బి.భాస్కర్, విజయలక్ష్మి, ఉమారాణి, జ్యోతి, సంకీర్తన, ధీరజ్, పాషా తదితరులు పాల్గొన్నారు.

పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి