
బీఆర్‌ఎస్ ధనదాహానికి రైతులు బలి
మోర్తాడ్: పదేళ్లపాటు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ నేతల ధనదాహానికి రైతులు బలయ్యారని రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ సుంకెట్ అన్వేష్‌రెడ్డి పేర్కొన్నారు. మోర్తాడ్ మండలంలోని దొన్కల్ వద్ద పెద్దవాగులో కొట్టుకుపోయిన చెక్‌డ్యాంను సోమ వారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా అన్వేష్ రెడ్డి మాట్లాడుతూ బాల్కొండ నియోజకవర్గంలోని కప్పలవాగు, పెద్దవాగులలో నిర్మించిన చెక్‌డ్యాంలు వర్షాల ధాటికి తట్టుకోలేక తెగిపోతున్నాయని చెప్పారు. దీంతో పంటలు నష్టపోయి రై తులకు తీరని వ్యధ మిగిలిందన్నారు. ఎస్సారెస్పీని నింపేందుకు రివర్స్ పంపింగ్ కోసం వేల కోట్లు ఖర్చు చేసినా చుక్కనీరు కూడా రాలేదని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో నియోజకవర్గానికి లాభం జరిగిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి ఫ్లెక్సీలతో జోరుగా ప్రచారం చేసుకుంటున్నారని, ఇది పూర్తిగా అవాస్తవమని వెల్లడించారు. చెక్‌డ్యాంలలో చోటు చేసుకున్న అవినీతి అక్రమాలకు ప్రశాంత్‌రెడ్డి పూర్తిగా బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట నాయకులు దొన్కల్ సంజీవ్‌రెడ్డి, రొక్కం మురళి, శివన్నోల్ల శివకుమార్, సోమ దేవారెడ్డి, ముత్యాల రాములు, బద్దం రాజశేఖర్, బూత్‌పురం మహిపాల్, సదానందంగౌడ్, పెండెం శ్రీనివాస్, ముత్యాల శ్రీనివాస్, అర్గుల్ రమేశ్, లచ్చల గంగారెడ్డి, ఆనంద్, ప్రసాద్, దొన్కల్ రవి తదితరులు పాల్గొన్నారు.