
జనావాసాల మధ్య బార్
● ఇబ్బందుల్లో స్థానికులు
● పట్టించుకోని అధికారులు
నిజామాబాద్‌అర్బన్: నగరంలోని ఆర్టీసీ కాలనీలో ఇళ్ల మధ్య ఇటీవల ఓ బార్ ప్రారంభమైంది. దీంతో బార్‌లోని వ్యర్థాలు రోడ్లపై పడేయడంతోపాటు, వంటశాల నుంచి వచ్చే దుర్వాసన, భారీ శబ్ధాలతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బార్‌కు రెండు వైపులా ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. మరోవైపు హనుమాన్ ఆలయం ఉంది. అలాగే చుట్టుపక్కల నివాసాలు ఉన్నాయి. అయినా ఇళ్ల మధ్య బార్‌కు అనుమతి ఎలా ఇస్తారంటూ స్థానికులు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీ నాయకులకు చెందిన బంధువు ఈ బార్‌ను ప్రారంభించారు. దీంతో అనుమతులు తేలికగా తీసుకున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు కాలనీవాసులు పేర్కొన్నారు.
రుద్రూర్: పోతంగల్ మండలం కారేగాం గ్రామానికి చెందిన పందిరి బుడ్డ చిన్నబోయి (64) అదృశ్యమైనట్లు కోటగిరి ఎస్సై సునీల్ తెలిపారు. ఈనెల 29న రాత్రి అతడు ఇంట్లో ఎవరికి చెప్పకుండా వెళ్లిపోయి ఇప్పటి వరకు తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో వారు ఆదివారం కోటగిరి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.