
ఉమ్మెడ బ్రిడ్జిపై పర్యాటకుల సందడి
నందిపేట్(ఆర్మూర్): మండలంలోని ఉమ్మెడ బ్రిడ్జి వద్ద పర్యాటకుల సందడి నెలకొంది. గత వారం రో జులుగా భారీ వర్షాలు కురవడంతో ఎన్నడు లేనివిధంగా గోదావరి నది ఉధృతంగా పరవళ్లు తొక్కు తు ప్రవహిస్తోంది. దీంతో ఆదివారం పర్యాటకులు అధిక సంఖ్యలో వచ్చి ప్రవాహాన్ని తిలకిస్తున్నారు. బ్రిడ్జికి ఆనుకుని ప్రవహిస్తున్న వరద నీరు వద్ద సె ల్ఫీలు తీసుకుని సంబురపడుతున్నారు. కొందరు పర్యాటకులు నీటి అంచుకు వెళ్లి సెల్ఫీలు దిగుతున్నారు. ఈక్రమంలో వరద ఉధృతి పెరిగితే ప్రాణా లకు ప్రమాదం పొంచి ఉందని పలువురు పేర్కొంటున్నారు. అధికారులు స్పందించి ఉమ్మెడ బ్రిడ్జి వద్ద ప్రమాదాలు జరుగకుండా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
బాల్కొండ: ఎస్సారెస్పీకి ఎగువ ప్రాంతాల నుంచి వరద పోటెత్తడంతో వరద గేట్ల ద్వారా గోదావ రిలోకి నీటి విడుదల కొనసాగుతోంది. ఈక్రమంలో ప్రాజెక్టును తిలకించడానికి ఆదివారం పర్యాటకులు భారీగా తరలివచ్చారు. ప్రాజెక్ట్ అందాలను చూసి, సెల్ఫీలు దిగారు. భద్రత కారణాల వల్ల అధికారులు సాయంత్రం వేళ కొంత సమయం మాత్రమే పర్యాటకులను ప్రాజెక్టుపైకి అనుమతి ఇస్తున్నారు.

ఉమ్మెడ బ్రిడ్జిపై పర్యాటకుల సందడి