
జిల్లాలోనే డొంకేశ్వర్ టాప్!
డొంకేశ్వర్(ఆర్మూర్): ఈ ఏడాది వానాకాలం సీజన్ లో ఇప్పటి వరకు కురిసిన వర్షాలతో డొంకేశ్వర్ మండలంలో అత్యధిక వర్షపాతం రికార్డయింది. వర్షాకాలంలో సెప్టెంబర్ నెల కలుపుకొని డొంకేశ్వర్ మండలంలో 62 సెంటీ మీటర్ల వర్షం కురవా ల్సి ఉండగా, ఇప్పటి దాకా 97 సెంటీ మీటర్లు కురి సింది. అంటే కురవాల్సిన దాని కంటే 35 సెంటీ మీ టర్లు ఎక్కువగా నమోదైంది. ఇది జిల్లాలోనే అత్యధిక వర్షపాతం కాగా, జిల్లా సగటు కంటే ఎక్కువ.
మూడు రోజుల్లోనే 19 సెం.మీ..
గడిచిన మూడు రోజుల్లోనే ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు మండలంలో 19 సెంటీ మీటర్ల వర్షపాతం రికార్డు కావడం గమనార్హం. ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్‌లో వరద నీరు పెరగడంతో శివారు ప్రాంతాల్లో వేసిన పంట పొలాలు కొన్ని నీట మునిగాయి. మండలంలోని గ్రామాలన్నీ చాలా సంవత్సరాల క్రితమే ఎస్సారెస్పీ ముంపు నుంచి లేచి వచ్చి దూరంగా ఎత్తయిన ప్రాంతాలకు వచ్చాయి. తద్వారా ఎంతటి భారీ వర్షాలు వచ్చినా వరద ముప్పు నుంచి తప్పించుకుంటున్నాయి. రోడ్లకూ ఎలాంటి నష్టం జరగడం లేదు.
● వర్షాకాలంలో ఇప్పటి వరకు 97 సెంటీ మీటర్లు వర్షపాతం నమోదు