
అప్రమత్తంగా ఉండాలి
బాల్కొండ: గోదావరికి వరద ఉధృతి పెరుగు తుండడంతో ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆర్మూర్ సబ్ కలెక్టర్ ఆభిజ్ఞాన్ మాల్వియా సూచించారు. శుక్రవారం ఆయన శ్రీరాంసాగర్ జలాశయాన్ని సందర్శించారు. గోదావరి ఒడ్డున ఉన్న రామాలయం, శివాల యం వరకు నీరు రావడంతో పక్కనే ఉన్న కాలనీవాసులతో మాట్లాడారు. ఎగువ ప్రాంతాల నుంచి వరద పెరిగే అవకాశం ఉందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు. గోదావరి వైపు ఎవ రూ వెళ్లొద్దని తెలిపారు. ఆయన వెంట తహసీల్దార్ సంతోష్‌రెడ్డి, ఆర్మూర్ రూరల్ సీఐ శ్రీధ ర్‌రెడ్డి, మెండోరా ఎస్సై జాదవ్ సుహాసిని, ఏఈఈ రామారావు, సిబ్బంది ఉన్నారు.
నిజామాబాద్ లీగల్: సారంగాపూర్‌లోని నిజా మాబాద్ సెంట్రల్ జైలును శుక్రవారం జిల్లా న్యాయసేవా సంస్థ కార్యదర్శి ఉదయ భాస్కర్‌రావు సందర్శించారు. నెలవారి తనిఖీల్లో భా గంగా ఆయన జైల్లో ఉన్న ఖైదీలతో మాట్లాడి వారి ఇబ్బందులను తెలుసుకున్నారు. న్యాయ సహాయం కోసం ఎదురుచూస్తున్న ఖైదీలకు, జిల్లా న్యాయ సేవ సంస్థ ద్వారా ప్యానెల్ న్యా యవాదులను ఏర్పాటు చేయనున్నట్టు ఉదయ భాస్కర్‌రావు తెలిపారు. అలాగే మహిళా ఖైదీ లు ఎదుర్కొంటున్న సమస్యలను సైతం ఆయ న అడిగి తెలుసుకున్నారు. జైలు అధికారులకు పలు సూచనలు చేశారు. జైలు సూపరింటెండెంట్ చింతల దశరథ్, జైలర్ ఉపేందర్ రావు, జైలు సిబ్బంది పాల్గొన్నారు.
42 సంవత్సరాల తర్వాత..
రెంజల్(బోధన్): చెరువులు నిండలేదు.. అలుగులు పారలేదు అయినా భారీ వరద రావడంతో 42 సంవత్సరాల నాటి పరిస్థితులను గోదావరి, మంజీరా పరీవాహక గ్రామాల ప్రజలు, రైతులు గుర్తు చేసుకుంటున్నారు. 1983వ సంవత్సరంలో ఇంతటి వరదను చూసినట్లు గ్రా మపెద్దలు పేర్కొన్నారు. 1986, 1992లో వరదలు వచ్చినా 1983 సంవత్స రం నాటి వరద ను మళ్లీ ఇప్పుడే తిలకిస్తున్నట్లు చెబుతున్నారు. కాగా, మహారాష్ట్ర నుంచి గోదావరి, నిజాంసాగర్ వైపు నుంచి వస్తోన్న మంజీర నది వరద నీరు కందకుర్తి త్రివేణి సంగమం వద్ద ఉగ్రరూ పం దాలుస్తోంది. శుక్రవారం మధ్యాహ్నం వ రకు కందకుర్తిలోని మహారాష్ట్ర సరిహద్దు వరకు చేరుకున్న వరద, సాయంత్రం గ్రామంలోని ముఖద్వారం వద్దకు చేరింది. దీంతో గ్రామంలోని ఇందిరమ్మ కాలనీవాసులను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

అప్రమత్తంగా ఉండాలి

అప్రమత్తంగా ఉండాలి