
రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలు
బోధన్: ఎడపల్లి మండలం సాటాపూర్ గేట్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఎడపల్లి ఎస్సై ముత్యాల రమ తెలిపిన వివరాలు ఇలా.. బోధన్ పట్టణానికి చెందిన షేక్ అన్సార్(38) శుక్రవారం ఉదయం వ్యక్తిగత పనుల నిమిత్తం బైక్‌పై నిజామాబాద్‌కు బయలుదేరాడు. ఎడపల్లి మండలంలోని సాటాపూర్‌గేట్ వద్ద అతడు ప్రమాదవశాత్తు డివైడర్‌ను ఢీకొట్టి కిందపడిపోయాడు. దీంతో అతడికి తీవ్ర గాయాలు కావడంతో వైద్య చికిత్స కోసం నిజామాబాద్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అతడి ఆరోగ్య పరిస్థితి కొంత మెరుగుపడిందని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.
చోరీ కేసులో నిందితుడి అరెస్టు
మోర్తాడ్: మోర్తాడ్‌లోని భగత్‌సింగ్ కాలనీలోగల ఓ ఇంట్లో చోరీకి పాల్పడిన నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు భీమ్‌గల్ సీఐ సత్యనారాయణ, మోర్తాడ్ ఎస్సై రాము తెలిపారు. మోర్తాడ్ పోలీసు స్టేషన్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. నాలుగు రోజుల క్రితం భగత్‌సింగ్ కాలనీకి చెందిన గురుడి అమృత్‌రావు ఇంట్లో చోరీ జరిగింది. ఇంట్లోని 9 మాసాల బంగారం, రూ.5వేల నగదు చోరీకి గురైంది. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ చేపట్టారు. విచారణలో ఎర్ల అశోక్ నిందితుడిగా తేలడంతో అతడిని పట్టుకొని బంగారంను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.