
చెరువులను తలపిస్తోన్న పొలాలు
● పొంగి పొర్లుతున్న వాగులు
● దెబ్బతిన్న పంటలను క్షేత్రస్థాయిలో
పరిశీలించిన అధికారులు
రుద్రూర్/వర్ని/రెంజల్/నందిపేట్/నవీపేట/బాల్కొండ/బోధన్‌రూరల్ : గత రెండు మూడు రోజులుగా కురిసిన వర్షానికి పంట పొలాలు చెరువులను తలపిస్తున్నాయి. వాగులు పొంగి పొర్లుతున్నాయి. చెరువులు నిండి మిగులు జలాలు అలుగుల ద్వారా ప్రవహిస్తున్నాయి. పాత ఇళ్లు దెబ్బతిన్నాయి. పో తంగల్ మండలంలోని మంజీర నది సమీపంలో పంట నష్టం భారీగా జరిగింది. మంజీర వరద సుంకిని గ్రామ ఇళ్లలోకి రావడంతో గ్రామస్తులు భ యాందోళనకు గురయ్యారు. రెవెన్యూ అధికారులు గ్రామాన్ని సందర్శించి వరద పరిస్థితిని సమీక్షించారు. కోటగిరిలో105 మి.మీ. పోతంగల్‌లో 86 మి.మీ. వర్షపాతం నమోదైంది. వ్యవసాయాధికారుల లెక్కల ప్రకారం రెంజల్ మండలంలో 6020 ఎకరాల్లో సోయా, వరి పంటలు నీట మునిగినట్లు నివేదిక పంపారు. కనీసం 8000 వేల ఎకరాల్లో పంటలు నీట మునిగినట్లు రైతులు పేర్కొంటున్నారు. గోదావరి, మంజీర నదుల పరివాహక గ్రామాలతో పాటు వాగులు, వంతెనల కింది రెంజల్ మండలంలోని కందకుర్తి, నీలా, పేపర్‌మిల్, బోర్గాం, తాడ్‌బిలోలి గ్రామాల్లో కనుచూపు మేరలో వేసిన పంటలు నీట మునిగాయి. నవీపేట మండలంలోని గోదావరి నది పరివాహక ప్రాంతాలైన కోస్లీ, మిట్టా పూర్, యంచ, అల్జాపూర్, నందిగామ, బినోల, తుంగిని, నాళేశ్వర్ గ్రామాలలోని 5 వేల ఎకరాలు పూర్తిగా నీటమునిగాయి. అల్జాపూర్–యంచ, నందిగామ–బినోల రహదారులపై నీరు నిలవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఉమ్మడి వర్ని మండలంలో రోడ్లు తెగిపోగా వందల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. పాత వర్ని, సైదిపూర్, శంకోరా, పైడిమల్ జలాల్పూర్, వెంకటేశ్వర క్యాంపు, చందూరు ,గోవురు తదితర గ్రామాల శివారులో వరదధాటికి పంట పొలాలు నష్టపోయాయి. పాత వర్ని నెహ్రూ నగర్ రోడ్డు వరదలకు కొట్టుకుపోయింది. రాజీపేట్ చెరువుకు గండి పడింది. దీంతో ఆయ కట్టు కింద సుమారు 200 ఎకరాల్లో పంట నష్టం ఏర్పడింది. నందిపేట పాలిటెక్నిక్ కళాశాల జలమయమైంది.కళాశాల, హస్టల్ భవనాల చుట్ట్టూ నీరు చేరి లోనికి వెళ్లేందుకు వీలు లేకుండా ఉంది. దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. బాల్కొండ నియోజకవర్గంలో ప్రవహించే పెద్ద వాగులో వరద ఉధ్రుతి తగ్గింది. పెద్ద వాగు నీరు ఏర్గట్ల మండలం తడ్‌పాకల్ వద్ద గోదావరిలోకి కలుస్తుంది. వాగు వద్దకు ఎవరు వెళ్లకుండా ఆయ గ్రా మ పంచాయతీల ఆధ్వర్యంలో చర్యలు చేపట్టారు. నందిపేట మండలంలోని తల్వేద–నాళేశ్వర్ వాగు పొంగి ప్రవహించింది. ఎగువ ప్రాంతంలో నీటి ఉ ధృతి తీవ్రమవడంతో నవీపేట మండలంలోని నాళేశ్వర్ గ్రామంతో పాటు నందిపేట మండలంలోని తల్వేద గ్రామానికి వారధిగా ఉన్న బ్రిడ్జి ప్రమాదానికి చేరువైంది.నాళేశ్వర్, తల్వెద గ్రామాల వాసులు శుక్రవారం ఈ బ్రిడ్జిని పరిశీలించి అధికారులకు సమాచారమిచ్చారు. తల్వేద వాగు బ్రిడ్జి వద్ద పేరుకుపోయిన గుర్రపు డెక్క వ్యర్థాలను రెవెన్యూ అధికారులు తొలగించారు.
ఐదు వేల ఎకరాలల్లో నీట మునిగిన పంటలు
బోధన్‌రూరల్ మండలంలోని మంజీర తీర గ్రామాల్లో శ్రీరాంసాగర్ బ్యాక్‌వాటర్, మంజీర నది వరద ఉధ్రుతితో సుమారు 5వేల ఎకరాల్లో పంటలు నీట మునిగినట్లు బోధన్ ఏడీఏ అలీం తెలిపారు. 3200పైగా ఎకరాల్లో సోయా, 1800పైగా ఎకరాల్లో వరి పంట నీట మునిగినట్లు ఆయన తెలిపారు. పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని ఆయన తెలిపారు. సాలూర మండలంలో సోయా 2820 ఎకరాలు,వరి 3,110 ఎకరాలు నీట మునిగి నష్టం వాటిల్లి ఉంటుందని అంచనా వేశామని ఏవో శ్వేత తెలిపారు.
పోతంగల్ మండలంలో 2వేల ఎకరాల్లో ..
పోతంగల్ మండలంలోని సుంకిని శివారులో వరి 270 ఎకరాల్లో, సోయా 300 ఎకరాల్లో, కల్లూర్ శివారులో వరి 196 ఎకరాల్లో, కొడిచర్ల శివారులో వరి 185 ఎకరాల్లో, సోయా15 ఎకరాల్లో, హంగర్గాలో శివారులో వరి 154 ఎకరాల్లో, సోయా 28 ఎకరాల్లో, కారేగాంలో వరి 52 ఎకరాల్లో, సోయా 29 ఎకరాల్లో, హెగ్డోలి శివారులో వరి 30 ఎకరాల్లో, సోయా 26 ఎకరాల్లో, కొల్లూర్ శివారులో వరి 70 ఎకరాల్లో, సోయా 50 ఎకరాల్లో, సోంపూర్ శివారులో వరి 40 ఎకరాల్లో, 75 ఎకరాల్లో, టాక్లీ శివారులో వరి 35 ఎకరాల్లో, సోయా 250 ఎకరాల్లో పంట దెబ్బతిన్నట్టు వ్యవసాయాధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. రుద్రూర్ మండలంలో వంద ఎకరాల్లో, కోటగిరి మండలంలో 15 ఎకరాల్లో వరి పంట దెబ్బతిన్నట్టు వ్యవసాయాధికారులు తెలిపారు.
పునరావాస కేంద్రాలకు తరలింపు
రెంజల్/బాల్కొండ : రెంజల్ ఎస్సై, చంద్రమోహన్, తహసీల్దార్ శ్రావణ్‌కుమార్‌లు ఆయా గ్రామాల స్థానికుల సహకారంతో వర్షాలకు కూలడానికి సిద్ధంగా ఉన్న ఇళ్లను గుర్తించారు. వారి ఇళ్ల వద్దకు చేరుకొని కుటుంబీకులకు కౌన్సెలింగ్ నిర్వహించి గ్రామాల్లోని పాఠశాలల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నట్లు ఎస్సై తెలిపారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి నీటి విడుదల చేపడుతుండటంతో ప్రాజెక్ట్ దిగువన పోచంపాడ్‌లోని వడ్డెర కాలనీ వాసులకు అధికారులు పునరావసం ఏర్పాటు చేశారు. కాలనీలో మహిళ సమాఖ్య భవనంలోకి కాలనీవాసులను తరలించారు.తహసీల్దార్ సంతోష్‌రెడ్డి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
కందకుర్తిలో పునరావాస కేంద్రాలకు
తరలిస్తున్న అధికారులు
నాళేశ్వర్ శివారులో ప్రమాదకరంగా మారిన బ్రిడ్జిని పరిశీలిస్తున్న గ్రామస్తులు
నందిపేట పాలిటెక్నిక్ కళాశాల భవనం
చుట్టూ చేరిన వరద నీరు

చెరువులను తలపిస్తోన్న పొలాలు

చెరువులను తలపిస్తోన్న పొలాలు

చెరువులను తలపిస్తోన్న పొలాలు

చెరువులను తలపిస్తోన్న పొలాలు

చెరువులను తలపిస్తోన్న పొలాలు

చెరువులను తలపిస్తోన్న పొలాలు

చెరువులను తలపిస్తోన్న పొలాలు