వరద ప్రాంతాలను పరిశీలించిన నాయకులు | - | Sakshi
Sakshi News home page

వరద ప్రాంతాలను పరిశీలించిన నాయకులు

Aug 30 2025 10:19 AM | Updated on Aug 30 2025 10:19 AM

వరద ప

వరద ప్రాంతాలను పరిశీలించిన నాయకులు

వేల్పూర్‌/మోర్తాడ్‌/వర్ని/రెంజల్‌/ : మండలంలోని రామన్నపేట్‌, మోతె, వేల్పూర్‌ మార్గంలో వరద ఉధృతికి దెబ్బతిన్న పంట పొలాలను, తెగిపోయిన రహదారిని రాష్ట్ర కో ఆపరేటివ్‌ చైర్మన్‌ మానాల మోహన్‌రెడ్డి శుక్రవారం పరిశీలించారు. పంటలు, రహదారులకు జరిగిన నష్టంపై ఏవో శృతి, పీఆర్‌ ఏఈ శ్రీనివాస్‌, ఇతర అధికారులతో మాట్లాడారు. నష్టం వివరాలను ఉన్నతాధికారులకు వెంటనే చేరవేయాలని అధికారులకు సూచించారు. భీమ్‌గల్‌ మండలంలో వరద ధాటికి నష్టపోయిన పంటలను, దెబ్బతిన్న రోడ్లను ఆయన పరిశీలించారు. ప్రజలు ఎలాంటి ఆందోళన చెందవద్దని సూచించారు. గత ప్రభుత్వం సరైన ప్రణాళిక లేకుండా నాసిరకంగా నిర్మించిన చెక్‌డ్యాంలతోనే పంటలకు నష్టం వాటిల్లుతోందని బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్‌ ఇన్‌చార్జి ముత్యాల సునీల్‌కుమార్‌ పేర్కొన్నారు. వేల్పూర్‌ మండలం అక్లూర్‌, రామన్నపేట్‌ గ్రామాలలో వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించారు. వరదలతో ధ్వంసమైన వంతెనలు, రహదారులు, పంటపొలాలను పరిశీలించారు.నియోజకవర్గంలో జరిగిన నష్టాన్ని సంబంఽధిత మంత్రులకు, సీఎంకు నివేదిస్తానని తెలిపారు.చందూర్‌ మండల కేంద్రంలో వరద నీళ్లు ఇళ్లలోకి ప్రవేశించిన బాధిత కుటుంబాలను బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ పరామర్శించారు. ఇళ్లు కూలిపోయిన వారికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు. చందూర్‌, శంకోరా, రాజిపేట్‌ శివార్లలో వరద ప్రవాహనికి దెబ్బతిన్న వరి పంటను స్థానిక రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి డీసీసీబీ మాజీ అధ్యక్షులు భాస్కర్‌ రెడ్డి పరిశీలించారు. వరదలతో ముంపుకు గురైన రెంజల్‌ మండలం నీలా, కందకుర్తి, తాడ్‌బిలోలి, బోర్గాం గ్రామాల్లో పంటలను, రహదారి పై వరద నీటి ప్రవాహన్ని కాంగ్రెస్‌ నాయకులు పరిశీలించారు. పంట నష్టం అంచనాలను గ్రామాల వారీగా రైతులు, ప్రజలతో మాట్లాడి ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డికి నివేదికను అందజేయనున్నట్లు మండల పార్టీ అధ్యక్షుడు మొబిన్‌ఖాన్‌ తెలిపారు.ఎస్సారెస్సీ నుంచి దిగువకు 7 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేసి బోధన్‌ నియోజకవర్గ రైతులు, ప్రజలను అధికారులు ఆదుకోవాలని బీజేపీ నాయకులు డిమాండ్‌ చేశారు. రెంజల్‌ మండలం నీలా, కందకుర్తి గ్రామాల్లో రాష్ట్ర నాయకులు వడ్డి మోహన్‌రెడ్డి, మేడపాటి ప్రకాష్‌రెడ్డిలు పర్యటించారు. ఈ సందర్భంగా మోహన్‌రెడ్డి మాట్లాడుతూ ఎస్సారెస్పీలో 65 టీఎంసీలను 50 టీఎంసీలకు తగ్గించాలని డిమాండ్‌ చేశారు. రైతులకు పంట నష్ట పరిహారం చెల్లించాలని బీజేపీ రాష్ట్ర నాయకులు యెండల లక్ష్మీనారాయణ డిమాండ్‌ చేశారు. పొతంగల్‌ శివారులో మంజీర వరద వల్ల దెబ్బతిన్న పంట పొలాలను ఆయన సందర్శించారు. వరద ఉధ్రుతి తగ్గగానే అధికారులు పంట నష్టం వివరాలు సేకరించి బాధిత రైతులకు పరిహారం అందించాలని కోరారు. పొతంగల్‌ మండలం సుంకిని గ్రామంలో బీజేపీ నేత, ఎన్‌ఆర్‌ఐ శశాంక్‌ ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు పర్యటించి వరద బాధితులకు బియ్యం అందజేశారు.

ఎకరానికి రూ.40 వేలు నష్టపరిహారం ఇవ్వాలి

రుద్రూర్‌/బోధన్‌/బోధన్‌ రూరల్‌/నవీపేట : ఉమ్మడి జిల్లాలో భారీ వర్షాలతో నీటి మునిగిన పంటలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.20 వేలు చొప్పున ఎకరానికి రూ.40 వేలు నష్ట పరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి రమేష్‌బాబు డిమాండ్‌ చేశారు. బోధన్‌, సాలూర మండలాల్లోని ఆయా గ్రామాల్లో నీట మునిగిన పంటలను ఆయన పరిశీలించారు. వరద బాధితులు, రైతులతో మాట్లాడారు. దెబ్బతిన్న పంటలకు ఎకరానికి రూ. 40వేలు చెల్లించాలని బీఆర్‌ఎస్‌ బాన్సువాడ నియోజక వర్గ నాయకులు జుబేర్‌, అంజిరెడ్డి డిమాండ్‌ చేశారు. పొతంగల్‌ మండలంలోని ఆయా గ్రామాల్లో మునిగిన పంటలను పార్టీ నాయకులతో కలిసి పరిశీలించారు. అనంతరం పొతంగల్‌లో వారు విలేకరులతో మాట్లాడారు. వర్షాలకు నష్టం వాటిల్లడంతో కేంద్ర ప్రభుత్వం వెంటనే విపత్తు నిధులను విడుదల చేయాలని నవీపేట మండల సీపీఎం నాయకులు శ్రీనివాస్‌, దేవేందర్‌సింగ్‌లు డిమాండ్‌ చేశారు.

వరద ప్రాంతాలను పరిశీలించిన నాయకులు 1
1/4

వరద ప్రాంతాలను పరిశీలించిన నాయకులు

వరద ప్రాంతాలను పరిశీలించిన నాయకులు 2
2/4

వరద ప్రాంతాలను పరిశీలించిన నాయకులు

వరద ప్రాంతాలను పరిశీలించిన నాయకులు 3
3/4

వరద ప్రాంతాలను పరిశీలించిన నాయకులు

వరద ప్రాంతాలను పరిశీలించిన నాయకులు 4
4/4

వరద ప్రాంతాలను పరిశీలించిన నాయకులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement