కమ్మర్‌పల్లి: కమ్మర్‌పల్లి మండల పరిషత్ కార్యాలయాన్ని జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈవో సాయన్న శుక్రవారం తనిఖీ చేశారు. ఈసందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ స్టేషన్ల, ఓటర్ల వివరాల మ్యాపింగ్‌ను ఆన్‌లైన్‌లో పరిశీలించారు. ఎంపీడీవో రాజశ్రీనివాస్, ఎంపీవో సదాశివ్ పాల్గొన్నారు.
ఫోన్ల అప్పగింత
మోర్తాడ్: మోర్తాడ్ పోలీసు స్టేషన్ పరిధిలో పోగొట్టుకున్న సెల్‌ఫోన్‌లను సీఈఐఆర్ పోర్టల్ ద్వారా గుర్తించి బాధితులకు అందించినట్లు ఎస్సై రాము శుక్రవారం తెలిపారు. ఆరుగురు గతంలో తమ ఫోన్లు పోయినట్లు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారని తెలిపారు. ప్రత్యేక పోర్టల్ ద్వారా ఫోన్‌లను గుర్తించి బాధితులకు అప్పగించినట్లు ఆయన వెల్లడించారు.
నీటిని వేడి చేసి తాగండి
బోధన్ టౌన్: పట్టణానికి సరఫరా చేసే తాగు నీటిని వేడిచేసుకొని తాగాలని మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ కోరారు. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన చేశారు.రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి పట్టణ తాగునీటి వనరైన బెల్లాల్ చెరువులోకి కొత్తగా నీరు, మట్టి రా వడం తో నీరు కలుషితం అవుతుందని, ఈనీ రు తాగడంతో అనారోగ్యం పాలవుతారని పేర్కొన్నారు. నీటిని కాచి చల్లార్చి తాగాలని కమిషనర్ జాదవ్ కృష్ణ సూచించారు.
బాల్కొండ తహసీల్దార్‌గా శ్రీనివాస్
బాల్కొండ: బాల్కొండ తహసీల్దార్‌గా ఆర్. శ్రీనివాస్ శుక్రవారం బాధ్యతలను స్వీకరించారు. ఇక్కడ తహసీల్దార్‌గా విధులు నిర్వహించిన శ్రీధర్ ఆర్మూర్ సబ్ కలెక్టర్ కార్యాలయానికి బదిలీ చేశారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన తహసీల్దార్‌ను కాంగ్రెస్‌పార్టీ నాయకులు ఘనంగా సన్మానించారు. బదిలీపై వెళ్లిన తహసీల్దార్‌కు వీడ్కోలు పలికారు. పార్టీ మండల అధ్యక్షుడు వెంకటేశ్‌గౌడ్, యూత్ అధ్యక్షుడు అర్వింద్, నాయకులు సంజీవ్, యూనిస్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
పెద్ద పులులు సంచరిస్తున్న వీడియో ఫేక్
డొంకేశ్వర్(ఆర్మూర్): నాగారం, మల్లారం అటవీ ప్రాంతంలో పెద్ద పులులు తిరుగుతున్నాయని శుక్రవారం ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. నాలుగు పెద్ద పులులు సంచరిస్తున్న వీడియోను చాలా మంది వారి ఫోన్లలో స్టేటస్‌గా పెట్టుకున్నారు. నాగారం డంపింగ్ యార్డు దగ్గర అని కొందరు, మల్లారం అటవీ ప్రాంతంలో అని మరి కొందరు ఒకే వీడియోను వాట్సప్, ఫేస్‌బుక్‌లతో వైరల్ చేశారు. దీంతో పెద్ద పులులున్నాయంటూ జిల్లా వ్యాప్తంగా ప్రచారం జరిగింది. దీనిపై స్పందించిన నార్త్ ఫారెస్ట్ రేంజ్ అధికారి సంజయ్‌గౌడ్ ఇది ఫేక్ వీడియో అని తేల్చారు. ఇది కాగజ్‌నగర్‌కు చెందిన పాత వీడియో అని స్పష్టం చేశారు. ప్రజలు ఈవీడియోను నమ్మవద్దని, ఎవరూ వైరల్ చేయకూడదని ఆయన కోరారు.
కోరుకున్నది జరగడంతో..
డొంకేశ్వర్(ఆర్మూర్): కోరుకున్నది జరగడంతో గతేడాది డొంకేశ్వర్ సత్య (కర్ర) గణపతి వద్ద భక్తులు కట్టిన కొబ్బరి కాయ ముడుపులును విప్పుతున్నారు. ఆర్మూర్ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా గెలుపొందిన బైండ్ల ప్రశాంత్ శుక్రవారం కర్ర గణపతిని దర్శించుకుని ముడుపు విప్పారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గొడిసెరం భూమేశ్‌రెడ్డి, సర్వసమాజ్ కమిటీ సభ్యులు మహిపాల్, సుమన్, బాపురావు, నాగరాజు, తదితరులున్నారు.
మండపంలో హోమం
రుద్రూర్; మండల కేంద్రంలోని సార్వజనిక్ గ ణేశ్ మండలి ఆధ్వర్యంలో శుక్రవారం హోమం నిర్వహించారు. అనంతరం భక్తులకు పురాణం మహేశ్వర శర్మ ప్రవచనం అందించారు. సార్వజనిక్ గణేశ్ మండలి ఏర్పాటు చేసి 75 ఏళ్లు అవుతున్న సందర్భంగా ప్రతిరోజు హోమం, అన్నదానం, స్వామీజీల ప్రవచనం కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
యువకుల రక్తదానం
నవీపేట: మండలంలోని రాంపూర్ గ్రామంలోని శివాజీ గణేశ్ మండలి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. మండలి నిర్వాహకులతో పాటు యువకులు రక్తదానం చేశారు. మహేందర్‌గౌడ్, రాము, శివ, భూమన్న, దివాకర్ తదితరులు పాల్గొన్నారు.