
అలుగు పారుతున్న రాళ్లవాగు
కమ్మర్‌పల్లి: జిల్లా సరిహద్దులోని కమ్మర్‌పల్లి మండలం కోనాపూర్ రాళ్లవాగు అలుగుపారుతోంది. రెండు మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం రా వడంతో డెడ్ స్టోరేజీలో ఉన్న రాళ్లవాగు ప్రాజెక్ట్ జ లాశయం శుక్రవారం నిండింది. దీంతో ప్రాజెక్ట్ మత్తడి పైనుంచి వరద నీరు దూకుతోంది. రాళ్లవా గు ప్రాజెక్ట్ జలాశయం సామర్థ్యం 192 మెట్రిక్ క్యూబిక్ ఫీట్ కాగా, విస్తీర్ణం 129.43 హెక్టార్లుగా ఉంది. జిల్లా నలుమూ లల నుంచి, జగిత్యాల, కరీంనగర్ జిల్లాల నుంచి పర్యాటకులు రాళ్లవాగును చూడాటానికి తరలి వస్తున్నారు.
నిండుకుండలా రుద్రూర్ చెరువు
రుద్రూర్: రుద్రూర్ చెరువు నిండు కుండను తలపిస్తోంది. అక్బర్ నగర్ – రుద్రూర్ మధ్యలో బ్రిడ్జి పక్కన రోడ్డు కోతకు గురైంది. ఇరిగేషన్ ఏఈ శృతి మండలంలో చెరువులను పరిశీలించారు. రోడ్డుకు కోతకు గురవడంతో స్థానిక నాయకులు వెంటనే స్పందించి రాళ్లు, కంకర వేయించడంతో ప్రమాదం తప్పింది. మండల కేంద్రంలోని కాటివాగులో ఉధృతి పెరగడంతో ప్రధాన ద్వారం స్వల్పంగా దెబ్బతింది. అధికారులు అవసరమైన మరమ్మతులు చేయించాలని స్థానికులు కోరుతున్నారు
కొనసాగుతున్న అలీసాగర్ నీటి విడుదల
బోధన్: ఎడపల్లి మండలంలోని ఠాణాకలాన్ గ్రామ శివారులోగల అలీసాగర్ రిజర్వాయర్‌కు భారీగా వరద నీరు చేరడంతో గురువారం ఉదయం నుంచి శుక్రవారం సాయంత్రం వరకు రిజర్వాయర్ మూడు వరద గేట్లు ఎత్తి దిగువన నిజాంసాగర్ ప్రాజెక్టు డి–50 కాలువల్లోకి నీరు విడుదల చేశారు. రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటి మట్టం 1299.6 ఫీట్లు కాగా 1297.10 ఫీట్ల వరకు వరద నీరు చేరింది. రిజర్వాయర్‌లోకి అవుట్‌ఫ్లో 1500 క్యూసెక్కులు కాగా, ఇన్‌ఫ్లో 1200 క్యూసెక్కులు ఉందని నీటిపారుదలశాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం రెండు గేట్ల ద్వారా నీటి విడుదల కొనసాగుతుంది.

అలుగు పారుతున్న రాళ్లవాగు