
చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి
ఆర్మూర్‌టౌన్/పెర్కిట్(ఆర్మూర్) : విద్యార్థులు చ దువుతో పాటు క్రీడల్లో రాణించాలని పాఠశాల హె చ్‌ఎం వనజ అన్నారు. పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో శుక్రవారం జాతీయ క్రీడా ది నోత్సవం జరుపుకున్నారు. ఈసందర్భంగా హాకీ మాంత్రికుడు మేజర్ ధ్యాన్‌చంద్ చిత్రపటానికి పూ లమాల వేసి నివాళులు అర్పించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విద్యార్థినులు క్రీడల్లో రా ణించి ఉన్నతస్థాయికి ఎదిగారన్నారు. అనంతరం పాఠశాలో అలేఖ్య అనే క్రీడాకారిణి సన్మానించారు. ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొన్నారు. ఆ ర్మూర్‌తో పాటు ఆలూర్ మండలంలోని ఆయా పా ఠశాలల్లో హెచ్‌ఎంలు ధ్యాన్‌చంద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆర్మూ ర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్‌లో ఇటీవల పదో న్నతిపై వచ్చిన పీడీ నిఖితను హెచ్‌ఎం శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు వెంకటరమణ చారి, విద్యార్థులు పాల్గొన్నారు.