
‘అలీసాగర్’ మూడు గేట్ల ఎత్తివేత
బోధన్: భారీ వర్షాలు, నిజాంసాగర్ ప్రాజెక్టు గేట్ల ఎత్తివేత నేపథ్యంలో ఎడపల్లి మండలంలోని ఠాణాకలాన్ గ్రామ శివారులోగల అలీసాగర్ రిజర్వాయర్‌కు భారీ వరద చేరుతోంది. రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటి మట్టం 1299.6 ఫీట్లు కాగా గురువారం సాయంత్రం వరకు 1297.10 ఫీట్లకు వరద నీరు చేరింది. ఈ క్రమంలో అధికారులు ఉదయం రెండు గేట్లు, సాయంత్రం మరో గేటును ఎత్తి 1400 క్యూ సెక్కుల నీటిని దిగువన ఉన్న నిజాంసాగర్ డి–50 కాలువల్లోకి వదిలారు. మూడు గేట్ల ద్వారా నీటి విడుదల కొనసాగుతుంది. రిజర్వాయర్‌లోకి ఇన్‌ఫ్లో 1500 క్యూసెక్కులకు పైగానే ఉందని నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. గురువారం రాత్రి రిజర్వాయర్‌లో మరింతగా ఇన్‌ఫ్లో పెరిగితే దిగువకు నీటి విడుదల పరిమాణాన్ని పెంచే అవకాశం ఉంది. ఎడపల్లి, రెంజల్, నవీపేట మండలాల్లో విస్తరించిన ఉన్న నిజాంసాగర్ డి–50 కాలువ కింద పంటలు నీట మునిగే అవకాశాలున్నాయి.