
సెల్ఫీ తెచ్చిన తంట
బోధన్‌టౌన్(బోధన్): భారీ వర్షాలకు బోధన్‌లో ని బెల్లాల్ చెరువు అలుగు పారడంతో ఓ యువకుడు సెల్ఫీ తీసుకోవడానికి వెళ్లి, అక్కడే చి క్కుకున్నాడు. స్థానికులు తాళ్ల సాయంతో సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. పట్టణంలో ని కుమ్మరిగల్లీకి చెందిన నవీన్ గురువారం బె ల్లాల్ చెరువు వద్దకు వెళ్లాడు. అలుగు పారడంతో సెల్ఫీ తీసుకోవడానికి యత్నించగా కాలు జారి అలుగు పైనుంచి కిందపడడంతో అక్కడే చిక్కుకున్నాడు. సమాచారం అందుకున్న మ త్య్స పారిశ్రామిక సంఘం పట్టణ అధ్యక్షుడు అ క్కడికి చేరుకొని గజ ఈతగాళ్లతోపాటు అక్కడే ఉన్న యువకుల సహాయంతో తాడు అందించి బయటకు తీశారు.