
మట్టి గణపతుల పంపిణీ
నిజామాబాద్ అర్బన్: నగరంలోని కలెక్టరేట్‌లో రెవెన్యూ అసోసియేషన్, హెల్పింగ్ హర్ట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంగళవారం మట్టి గణపతులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి గణపతులను అందజేశారు. మట్టి గణపతుల వినియోగం పెంచాలని, పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని సుదర్శన్‌రెడ్డి సూచించారు. కార్యక్రమంలో కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి, అదనపు కలెక్టర్ కిరణ్‌కుమార్, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, రెవెన్యూ అసోసియేషన్ నాయకులు రమణ్‌రెడ్డి, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.
నిజామాబాద్ రూరల్: ప్రముఖ మెజీషియన్ రంగనాథ్ డాక్టర్ బీవీ పట్టాభిరామ్ మొదటి స్మారక జాతీయ పురస్కారానికి ఎంపికై నట్లు తెలంగాణ సైకలాజికల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఎం ఏ కరీం తెలిపారు. ఇంద్రజాల రంగంతోపాటు మనోవికాస రంగంలో విశిష్టత సాధించి జిల్లా ఖ్యాతిని దేశవ్యాప్తంగా చాటిన రంగనాథ్‌కు ‘మైండ్ పవర్ మెజీషియన్’గా గుర్తించి అవార్డును సెప్టెంబర్ 10న హైదరాబాద్‌లో ప్రదానం చేయనున్నట్లు పేర్కొన్నారు.

మట్టి గణపతుల పంపిణీ