
క్రీడాకారులకు అభినందన
నిజామాబాద్‌నాగారం : జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన పోటీల్లో తమ పాఠశాల విద్యార్థులు బంగారు పతకాలు సాధించారని నవ్యభారతి గ్లోబల్ పాఠశాల చైర్మన్ కె సంతోష్ కుమార్, కరస్పాండెంట్ శ్రీదేవి మంగళవారం తెలిపారు. పాఠశాలలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో క్రీడాకారులను అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పాఠశాలకు చెందిన సీహెచ్ ఉదయ్, కార్తీక, అన్విత, అద్విత, అతుల్ పటేల్‌లు గోల్డ్ మెడల్, క్రాంతి సిల్వర్ మెడల్, సుశాంత్ బ్రాంజ్ మెడల్ సాధించారని అన్నారు. తమ పాఠశాల విద్యార్థులు జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటు విజయం సాధిస్తున్నారని పేర్కొన్నారు. పాఠశాలలో విద్యతో పాటు క్రీడలకు సైతం ప్రాముఖ్యత ఇస్తున్నట్లు తెలిపారు. హెచ్‌ఆర్ డైరెక్టర్ లత, ప్రిన్సిపాల్ ఆంథోని, వైస్ ప్రిన్సిపాల్ సరిత, ఉపాధ్యాయులు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.