
రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌కు ఎంపిక
నిజామాబాద్ నాగారం: బాలబాలికల అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ పోటీలలో ప్రతిభ కనబర్చిన 30 మందిని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు నరాల రత్నాకర్, రాజాగౌడ్ మంగళవారం తెలిపారు. ఈ నెల 23, 25 తేదీల్లో నిర్వహించిన అండర్ 14, 16, 18, 20 బాలబాలికల అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ పోటీలలో జిల్లా నలుమూలల నుంచి 48 పాఠశాలలు పాల్గొన్నాయన్నారు. ఎంపికై న వారు అథ్లెట్లు ఈ నెల 30, 31వ తేదీలలో మహబూబ్‌నగర్ జిల్లాలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన పాఠశాలలు, కళాశాలలకు ఓవరాల్ చాంపియన్‌షిప్ ట్రోఫీలను అందజేశారు.