
డంపింగ్ యార్డు పరిశీలన
మోపాల్: మండలంలోని మంచిప్పలో ఉన్న డంపింగ్ యార్డును ట్రెయినీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావీ మంగళవారం పరిశీలించారు. నిజామాబాద్ నగర ప్రజలకు తాగునీరు అందించే మంచిప్ప పెద్ద చెరువులోకి డంపింగ్ యార్డు నుంచి మురుగు నీరు, చెత్తా చెదారం వెళ్లి కలుషితమవుతున్నాయని, ఆలయాలకు వచ్చే భక్తులు ఇబ్బంది పడుతున్నారని గ్రామస్తులు ప్రజావాణిలో ఫిర్యాదుచేశారు. కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆదేశాల మేరకు ట్రెయినీ కలెక్టర్ డంపింగ్ యార్డు, కంపోస్ట్ షెడ్డు, పెద్ద చెరువును పరిశీలించి పంచాయతీ కార్యదర్శి శ్యామ్‌కుమార్ వద్ద వివరాలు అడిగి తెలుసుకున్నారు.