నగరంలో ఫుట్‌ పెట్రోలింగ్‌ | - | Sakshi
Sakshi News home page

నగరంలో ఫుట్‌ పెట్రోలింగ్‌

Aug 27 2025 9:39 AM | Updated on Aug 27 2025 9:39 AM

నగరంలో ఫుట్‌ పెట్రోలింగ్‌

నగరంలో ఫుట్‌ పెట్రోలింగ్‌

రేషన్‌ కార్డుల పంపిణీ సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు.. బాధితుడికి పరామర్శ 29న ఉద్యోగమేళా ఆర్థిక సాయం అందజేత

ఖలీల్‌వాడి: గణేశ్‌ ఉత్సవాల సందర్భంగా జి ల్లా కేంద్రంలో భద్రతా ఏర్పాట్లపై సీపీ సాయి చైతన్య ఫుట్‌ వాకింగ్‌(పెట్రోలింగ్‌) మంగళవారం నిర్వహించారు. ప్రధాన వినాయక మండపాలు, ప్రధాన రహదారులు, చౌరస్తాల వద్ద సీపీ స్వయంగా పర్యటించి భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. ప్రతి ఒక్కరూ శాంతియుతంగా పండుగను జరుపుకోవాలని సీపీ సూ చించారు. నగరంలోని నెహ్రూ పార్క్‌, పెద్ద పో స్టాఫీస్‌, లక్ష్మి మెడికల్‌, పెద్ద బజార్‌, ఆర్‌ఆర్‌ చౌరస్తా, వినాయకుల బావి, వీక్లీ మార్కెట్‌, పోచమ్మ గల్లీ, రవితేజ గణేశ్‌ మండపం, పలు ప్రాంతాల్లో పర్యటించారు. ఏసీపీ మస్తాన్‌ అలీ, టౌన్‌ సీఐ శ్రీనివాస్‌ రాజ్‌, సిబ్బంది ఉన్నారు.

సిరికొండ: మండలంలోని గడ్కోల్‌, ముషీర్‌నగర్‌ గ్రామాల్లో లబ్ధిదారులకు కొత్త రేషన్‌ కార్డులను డీసీసీ ప్రధాన కార్యదర్శి వెల్మ భాస్కర్‌రెడ్డి మంగళవారం పంపిణీ చేశారు. కార్యక్రమాల్లో మాజీ ఎంపీటీసీ లింబాద్రి, సంపత్‌రెడ్డి, భానుచందర్‌, రాజేందర్‌, అఖిల్‌, గవాస్కర్‌, సుమన్‌, శ్రీనివాస్‌, గంగారెడ్డి, సంతోష్‌నాయక్‌, గురిజల నరేశ్‌, మోహన్‌, జగన్‌నాయక్‌, గజన్‌లాల్‌, కిశోర్‌గౌడ్‌, తిరుపతి, ఉమ్లా తదితరులు పాల్గొన్నారు.

సిరికొండ: మండలంలోని న్యావనంది, తూంపల్లి, పెద్దవాల్గోట్‌, పోత్నూర్‌ గ్రామాల్లో బాధితులకు మంజూరైన సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను కాంగ్రెస్‌ నాయకులు మంగళవారం పంపిణీ చేశారు. కార్యక్రమాల్లో పార్టీ మండల ఉపాధ్యక్షుడు రాజేశ్వర్‌గౌడ్‌, లక్ష్మణ్‌, మాజీ సర్పంచ్‌ దేవరాజు, లక్ష్మణ్‌గౌడ్‌, యూత్‌ కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు ప్రవీణ్‌, నర్సారెడ్డి, రాంరెడ్డి, లియాఖత్‌ అలీ, రమేశ్‌, గంగారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సిరికొండ: మండలంలోని ముషీర్‌నగర్‌లో విద్యుత్‌ ప్రమాదానికి గురైన కాంగ్రెస్‌ కార్యకర్త రాంసింగ్‌ను డీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్కోల్‌ భాస్కర్‌రెడ్డి పరామర్శించారు. ఏఎంసీ డైరెక్టర్‌ సంపత్‌రెడ్డి, సంతోష్‌నాయక్‌, మోహన్‌నాయక్‌, గజన్‌లాల్‌, జగన్‌, నరేష్‌, ఉమ్లా, రాజు, రాములు, తార తదితరులు ఉన్నారు.

నిజామాబాద్‌ అర్బన్‌: ఇటీవల ఇంటర్‌ పూర్తిచేసిన విద్యార్థులకు హెచ్‌సీఎల్‌ టెక్‌బీ సంస్థ, ఇంటర్మీడియెట్‌ విద్య ఆధ్వర్యంలో 29న ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు డీఐఈవో తిరుమలపుడి రవికుమార్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలి పారు. ఈ ఉద్యోగమేళాలో ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ, వొకేషనల్‌ కంప్యూటర్‌ సైన్స్‌ చేసిన విద్యార్థులు అర్హులని పేర్కొన్నారు. 29న ఉదయం 10 గంటలకు వర్ని రోడ్‌లోని వెంకటేశ్వర కంప్యూటర్‌ ఇన్‌స్టిట్యూట్‌లో హాజరుకావా లన్నారు. వివరాలకు 8074065803, 79818 34205 నెంబర్లను సంప్రదించాలన్నారు.

బైరాపూర్‌లో ఘనంగా తీజ్‌

మోపాల్‌: మండలంలోని బైరాపూర్‌ జీపీ పరిధిలోని నాలుగు తండాల్లో మంగళవారం తీజ్‌ పండుగను ఘనంగా నిర్వహించారు. సేవాలాల్‌ మహరాజ్‌, జగదాంబ మాతా ఆలయాల్లో పూజలు చేసి, బోగ్‌భండార్‌ చేపట్టారు.

ప్రత్యేక బడ్జెట్‌ కేటాయించాలి

తెయూ(డిచ్‌పల్లి): రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ యూనివర్సిటీ అభివృద్ధికి రూ.వేయి కోట్ల ప్రత్యేక బడ్జెట్‌ను కేటాయించాలని ఏఐఎస్‌ఎఫ్‌ జాతీయ అధ్యక్షుడు విరాజ్‌ డిమాండ్‌ చేశారు. మంగళవారం ఏఐఎస్‌ఎఫ్‌ తెలంగాణ యూనివర్సిటీ కౌన్సిల్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రధాని నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ విద్యావ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేశారని ఆరోపించారు. సమావేశంలో రెహమాన్‌, రఘురాం, భరత్‌, సంజీవ్‌, చందు, సాయి, అజయ్‌, భార్గవి, మోక్షిత్‌, భీమేశ్‌, ప్రభాస్‌, పీర్‌సింగ్‌ తదితరులు పాల్గొన్నారు.

హామీలను అమలు చేయాలి

ఇందల్వాయి: కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని మాజీ జెడ్పీటీసీ బాజిరెడ్డి జగన్‌ అన్నారు. ఇందల్వాయి మండల కేంద్రంలో మంగళవారం నిర్వమించిన బీఆర్‌ఎస్‌ పార్టీ మండల స్థాయి సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. స్థానిక ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ సత్తా చాటేలా నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలన్నారు. బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు దాసు, మాజీ డీసీఎంఎస్‌ చైర్మన్‌ సంబారు మోహన్‌, మాజీ వైస్‌ ఎంపీపీ అంజయ్య, నాయకులు రఘు, పాశం కుమార్‌, చింతల దాసు, మల్లాపూర్‌ రాము, పులి శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

ధర్పల్లి: మండలంలోని హోన్నాజీపేట్‌కు చెందిన చేపల నర్సయ్య ఇటీవల మృతి చెందడంతో ధర్మపురి అర్వింద్‌ ఫౌండేషన్‌ ద్వారా బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు నక్క రాజేశ్వర్‌ బాధిత కుటుంబానికి రూ. లక్ష చెక్కును మంగళవారం అందజేశారు. బీజేపీ మండల అధ్యక్షుడు మహిపాల్‌ యాదవ్‌, జిల్లా నాయకుడు ప్రదీప్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement