
గుంతలను పూడ్చిన ట్రాఫిక్ పోలీసులు
ఖలీల్‌వాడి: నగరంలోని రైల్వే ఫ్లైఓవర్ వద్ద ట్రాఫిక్ పోలీసులు మంగళవారం శ్రమదానం చేశారు. ఇటీ వల ఈ ప్రాంతంలో కేబుల్ ఆపరేటర్లు ఈ ప్రాంతంలో గుంతలు తవ్వి అలాగే వదిలేశారు. దీంతో వాహనదారులకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ట్రాఫిక్ సీఐ ప్రసాద్ ఆధ్వర్యంలో పోలీసులు శ్రమదానం చేశారు. రోడ్డుపై ఉన్న మట్టిని, రాళ్లను తొలగించారు. శ్రమదానంలో ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ కేశవులు, కిరణ్, రాజసాగర్, గోపాల్, దినేశ్ మట్టి, రాళ్లను తొలగించి ట్రాఫిక్‌కు అంతరాయం కలుగకుండా చేశారు. ట్రాఫిక్ పోలీసు పనితీరుపై నగర ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
ఖలీల్‌వాడి: నగరంలోని ఖలీల్‌వాడిలో ట్రాఫిక్ ని యంత్రణకు ట్రాఫిక్ పోలీసులు చర్యలు చేపట్టారు. మంగళవారం నగరంలోని రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో ఏసీపీ మస్తాన్ అలీ, ట్రాఫిక్ సీఐ ప్రసాద్ వాహనాల పార్కింగ్ కోసం మున్సిపల్ సిబ్బంది స హకారంతో హద్దులను నిర్ణయించారు. ఖలీల్‌వాడికి వచ్చే వాహనదారులకు ఈ పార్కింగ్ సౌకర్యం అందుబాటులో ఉంటుందని సీఐ ప్రసాద్ తెలిపారు. ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన ప్రాంతంలోనే వా హనాలను పార్కింగ్ చేయాల్సి ఉంటుందన్నారు.
సెప్టెంబర్ 30లోగా
దాఖలు చేయాలి
నిజామాబాద్ నాగారం: ఆదాయపు పన్ను మినహాయింపులకు సంబంధించి ఫారం 10ఏ, బీను సెప్టెంబర్ 30లోపు దాఖలు చేయాలని ఆదాయపు పన్ను శాఖ అధికారి విజయ్ కుమార్ సాహు పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని టాక్స్ బార్ భవన్‌లో ఆదాయపు పన్ను చట్టాలపై మంగళవారం ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ఆదాయ పన్ను సంచాలకులు బాలకృష్ణ, అదనపు సంచాలకులు సుమిత ఆదేశాల మేరకు ఆదాయ పన్ను చట్టాలు, నూతన సవరణలు, మినహాయింపులపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు రామనాథ్‌రెడ్డి, జగదీశ్ ప్రసాద్‌మీనా, సీఏలు, స్వచ్ఛంద సంస్థల, విద్యాసంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

గుంతలను పూడ్చిన ట్రాఫిక్ పోలీసులు

గుంతలను పూడ్చిన ట్రాఫిక్ పోలీసులు