
మట్టి గణపతులపై అవగాహన
నిజామాబాద్ రూరల్/ ధర్పల్లి/ జక్రాన్‌పల్లి: ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని కాపాడాలని పలువురు ఉపాధ్యాయులు, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు అన్నారు. గుండారం ఉన్నత పాఠశాలలో మంగళవారం మట్టి గణపతులపై అవగాహన కల్పించారు. నగరంలోని రామకృష్ణ పాఠశాలలో విద్యార్థులు మట్టితో వినాయకుని ప్రతిమలను తయారు చేశారు. కార్యక్రమంలో రామకృష్ణ విద్యాలయ కరస్పాండెంట్ శశిరేఖ శ్రీనివాస్, హెచ్‌ఎం సముద్రాల మధు మాధురి, విద్యార్థులు పాల్గొన్నారు. నగరంలోని జీపీఎస్ కోటగల్లి శంకర్ భవన్ పాఠశాలలో విద్యార్థులు మట్టితో గణపతులను తయారు చేశారు. కార్యక్రమంలో హెచ్‌ఎం రామచందర్ గైక్వాడ్, ఉపాధ్యాయులు దయానంద్, మమత, నందిని, సౌందర్య, ముకుందు, విద్యార్థులు పాల్గొన్నారు. ధర్పల్లి మండలంలోని దమన్నపేట్ మండల ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు మట్టి వినాయక ప్రతిమలను తయారు చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు వెంకట్ రాజారెడ్డి, రాంచందర్, అజయ్ కుమార్, రమణ, రాజేశ్వర్, అనురాధ పాల్గొన్నారు. జక్రాన్‌పల్లి మండలంలోని చింతలూర్ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులు రాములు మట్టి గణపతులను తయారు చేశారు. విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

మట్టి గణపతులపై అవగాహన