
డొంకేశ్వర్‌లో కర్ర గణపతి
డొంకేశ్వర్(ఆర్మూర్): వినాయక చవితి ఉత్సవాలకు డొంకేశ్వర్‌లోని (చెక్క) సత్య గణపతి సిద్ధమైంది. ఎనిమిదో వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు సర్వసమాజ్ కమిటీ అన్ని ఏర్పాట్లు చేసింది. 2018లో గ్రామస్తులు ఒక్కొక్కరు రూ.10 చొప్పున డబ్బులు పోగు చేసి నిర్మల్ జిల్లా సిద్ధాపూర్‌లో జ్ఞానేశ్వర్ అనే కళాకారుడితో దీనిని తయారు చేయించారు. విగ్రహం తయారు చేసేందుకు మామిడి, తెల్ల జిల్లేడు, ఎర్రచందనం, రాగి చెక్కలను ఉపయోగించారు. 2018 సెప్టెంబర్ 13నుంచి మండల కేంద్రంలోని సత్య గంగవ్వ మండపంలో విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. విగ్రహాన్ని నిమజ్జనం చేయకుండా రామాలయంలోని ప్రత్యేక గదిలో భద్రపరుస్తారు. మళ్లీ వినాయక చవితికి ఒకరోజు ముందు తెరిచి శుద్ధి చేస్తారు. చవితినాడు రామాలయం నుంచి ఊరేగింపుగా మండపానికి తెస్తారు. సత్య గణపతిని దర్శిచుకుని అక్కడే ముడుపులు కడితే కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం. అందుకే జిల్లా నలుమూలల నుంచి ప్రజలు ‘సత్య గణపతి’ని దర్శించుకునేందుకు భారీగా తరలివస్తారు.

డొంకేశ్వర్‌లో కర్ర గణపతి