
గణపయ్య పూజకు వేళాయే..
● నేటి నుంచి నవరాత్రోత్సవాలు
నిజామాబాద్ రూరల్: విఘ్ననాయకుడి నవరాత్రోత్సవాలకు సర్వంసిద్ధమైంది. బొజ్జ గణపయ్య రాకకోసం మండపాలు, ఇళ్లు ముస్తాబయ్యాయి. సుదూర ప్రాంతాల నుంచి ఇప్పటికే భారీ ప్రతిమలు తరలిరాగా, జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి మండపాలకు మంగళవారం ఉదయం నుంచి తరలించారు. జిల్లా కేంద్రంలోని మార్కెట్ గణేశ్ మండళ్ల నిర్వాహకులు, పూజా సామగ్రి కొనుగోళ్లతో సందడిగా మారింది. ఉత్సవాల కోసం నిజామాబాద్ నగరంలోని గణపతి ఆలయాలను ముస్తాబు చేశారు. నగరంలోని రైల్వేకమాన్ వద్ద ఉన్న గణపతి ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇందూరులో 300 ఏళ్ల చరిత్ర కలిగిన బొడ్డెమ్మ చెరువు వద్ద నున్న వినాయక ఆలయంలో ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు.

గణపయ్య పూజకు వేళాయే..