
అటవీ పక్షులు పెంచుతున్న ముగ్గురిపై కేసు
● నిజామాబాద్ నగరంలో తనిఖీలు
డొంకేశ్వర్(ఆర్మూర్): నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మాలపల్లి ప్రాంతంలో అటవీ పక్షులను బంధించి పెంచుతున్న దుకాణాలపై అటవీ అధికారులు మంగళవారం దాడులు నిర్వహించారు. ఓ దుకాణంలో అటవీ చిలుకలు, అటవీ కంజులను గుర్తించిన అధికారులు ఇది అటవీ చట్టానికి విరుద్ధమని స్పష్టం చేశారు. దుకాణ యజమానులైన సయ్యద్ సిరాజుద్దీన్, షాజూర్ రహమాన్ ఖాన్, సయ్యద్ బిన్ ఖాలీద్‌లపై అటవీ చట్టం కింద కేసులు నమోదు చేశారు. దాడుల్లో నిజామాబాద్ ఎఫ్‌డీవో సుధాకర్, ఎఫ్‌ఆర్వో సంజయ్ గౌడ్, సిబ్బంది ఉన్నారు.