
ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన కొనసాగాలి
● రిటైర్డ్ జడ్జి హేమంత్‌కుమార్
తెయూ(డిచ్‌పల్లి): అధికారం, ధనం, బంధుప్రీతికి అతీతంగా ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన కొనసాగాలని చట్టాలు సూచిస్తున్నాయని హైదరాబా ద్ జిల్లా రిటైర్డ్ జడ్జి డాక్టర్ డి.హేమంత్‌కుమార్ పేర్కొన్నారు. తెలంగాణ యూనివర్సిటీ న్యాయ కళాశాలలో సోమవారం ‘చట్టాల విశ్లేషణ – వివేచన’ అంశంపై నిర్వహించిన వర్క్‌షాప్‌లో ఆయన రిసోర్స్ పర్సన్‌గా హాజరై ప్రసంగించారు. సమాజంలో పెడధోరణులు పెరగకుండా చట్టాలు సహజ సూత్రాలను అందిస్తాయన్నారు. భారత రాజ్యాంగం ప్రకారం కుల, మత, వర్గ, వర్ణ తేడా లేకుండా చట్టం దృష్టిలో అందరూ సమానమని తెలిపారు. అనంతరం న్యాయ విద్యార్థులు అడిగిన పలు సందేహాలకు వివరణాత్మకంగా సమాధానాలు ఇచ్చారు. కార్యక్రమంలో న్యాయ కళాశాల ప్రిన్సిపల్ కే ప్రసన్న రాణి, బీవోఎస్ చైర్మన్ బీ స్రవంతి, న్యాయ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.
● అసిస్టెంట్ లేబర్ కమిషనర్ నరేందర్‌రాజు
నిజామాబాద్‌నాగారం: జిల్లాలో ఎలక్ట్రీషియన్ పనులు చేస్తున్న ప్రతి ఒక్కరూ కచ్చితంగా లేబర్‌కార్డులు తీసుకోవాలని అసిస్టెంట్ లేబర్ కమిషనర్ నరేందర్‌రాజు తెలిపారు. నగరంలోని గవర్నమెంట్, ప్రైవేటు ఎలక్ట్రికల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు వైసాక్షి సంతోష్ ఆధ్వర్యంలో సోమవారం లేబర్ కార్డులపై అవగాహన కల్పించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే కార్డులతో ఇన్సూరెన్స్, ఆర్థికసాయం అందుతుందన్నారు. కార్డు ఐదేళ్లకోసారి రెన్యువల్ చేయించుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎలక్ట్రీషియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ సలీం, టౌన్ ప్రెసిడెంట్ రమేశ్, అజీమ్ అత్తర్ ఖాన్, లింబాద్రి తదితరులు పాల్గొన్నారు.
తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో ఏర్పాటు చేసిన 7 పరీక్ష కేంద్రాల్లో కొనసాగుతున్న పీజీ, బీఈడీ, బీపీఎడ్ సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్‌లాగ్ పరీక్షల్లో సోమవారం 90 మంది విద్యా ర్థులు గైర్హాజరైనట్లు ఆడిట్ సెల్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. ఉదయం జరిగిన పీజీ, ఇంటిగ్రేటెడ్ పీజీ 2,4వ సెమిస్టర్ పరీక్షలకు 1504 మంది విద్యార్థులకు 1438 మంది హాజరు కాగా 66 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం జరిగిన బీఈడీ, బీపీఎడ్ పరీక్షలకు 489 మంది విద్యార్థులకు గానూ 465 మంది హాజరుకాగా 24 మంది గైర్హాజరైనట్లు తెలిపారు.

ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన కొనసాగాలి