
సొంతగూటికి విజయభారతి
● కేటీఆర్ సమక్షంలో
బీఆర్‌ఎస్‌లో చేరిక
ఆర్మూర్: నియోజకవర్గ పరిధిలోని ఆలూర్ మండల కేంద్రానికి చెందిన బీజేపీ నాయకురాలు విజయభారతి హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆలూర్ నుంచి వాహనాల్లో ర్యాలీగా హైదరాబాద్‌కు వెళ్లి బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. బీజేపీ సీనియర్ నాయకుడు ఆలూర్ గంగారెడ్డి కూతురు విజయభారతి సొంతగూటికి చేరుకున్నట్లు కేటీఆర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. చేరిక కార్యక్రమంలో మాజీ మంత్రి సబిత ఇంద్రారెడ్డి, ఆయుష్య, జెడ్పీ మాజీ చైర్మన్ దాదన్న గారి విఠల్‌రావు, అరవింద్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ మోతె చిన్నారెడ్డి, మోహన్ రెడ్డి, ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.