
జాతీయ సమగ్రతకు పాటుపడాలి
● పోటీతత్వాన్ని పెంపొందించుకోవాలి
● రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం.యాదగిరి
తెయూ(డిచ్‌పల్లి): జాతీయ సేవా పథకం (ఎన్‌ఎస్‌ఎస్) ద్వారా వలంటీర్లు జాతీయ సమగ్రతకు పాటుపడాలని తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం.యాదగిరి సూచించారు. తెయూ ఎన్‌ఎస్‌ఎస్ ఆధ్వర్యంలో సోమవారం ప్రీ రిపబ్లిక్ పరేడ్ ఎంపికలను నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన రిజిస్ట్రార్ యాదగిరి మా ట్లాడుతూ.. ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్లు సమాజ సేవా కార్యక్రమాల్లో విరివిగా పాల్గొనాలని సూచించారు. ప్రతి వలంటీర్ ప్రీ పరేడ్ ఎంపికకు పోటీ పడాలని, పోటీతత్వాన్ని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం రాష్ట్ర ఎన్‌ఎస్‌ఎస్ యువజన అధికారి సైదా నాయక్ పర్యవేక్షణలో విద్యార్థుల ఎత్తు, పరు గు పందెం, పరేడ్, కల్చరల్ కార్యక్రమాలు, వ్యక్తిగత నైపుణ్యాన్ని పరీక్షించారు. కార్యక్రమంలో తె యూ ఎన్‌ఎస్‌ఎస్ కో–ఆర్డినేటర్ ప్రొఫెసర్ కే రవీందర్‌రెడ్డి, ప్రోగ్రాం అధికారులు స్వప్న, సంపత్, స్ర వంతి, అలీంఖాన్, అంజయ్య, ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.